అప్రూవర్ బాటలో కవిత..!
Publish Date:Jul 26, 2024
Advertisement
కేసీఆర్ ముద్దుల కూతురు కవిత జీవితంలో తాను ఎదుర్కొంటానని ఎంతమాత్రం ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కవిత మాత్రమే కాదు.. ఆమె ఇప్పుడున్న పరిస్థితి ఆమె శత్రువులు కూడా ఊహించనిది. తీహార్ జైల్లో ఇన్ని నెలలు వుండటం అనేది మామూలు విషయం కాదు. కవిత లాంటి మహిళ ఇన్ని నెలలపాటు జైల్లో వున్న తర్వాత ఎంత పేరు, ప్రఖ్యాతి వున్నా ఏం లాభం.. ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం? తాజా పరిస్థితులనుబట్టి ఆగస్టు 8 వరకు కవిత ఖాయంగా జైల్లోనే వుంటారు. ఆ తర్వాత కస్టడీ మళ్ళీ పొడిగించే అవకాశాలు కూడా వున్నాయి. ఇంతకాలం యువరాణిలా, మహారాణిలా ఒక వెలుగు వెలిగిన కవిత తీహార్ జైల్లోని పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు. జైల్లో పడ్డానన్న డిప్రెషన్‌తోపాటు అక్కడి ఆహారం, దోమలు, చుట్టుపక్కల వున్న పరిస్థితులు కవితని పూర్తిగా క్రుంగదీశాయి. దాంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆస్పత్రికి కూడా వెళ్ళి, చికిత్స తరవాత తిరిగి జైలుకు రావాల్సి వచ్చింది. కవిత అనారోగ్య పరిస్థితిని చూసి అయినా ఆమెకి బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ఆశించారు. కానీ, చట్టం ఆమె చేసిన నేరం గురించే ఆలోచిస్తోంది తప్ప, ఆమె ఆరోగ్యం గురించి కాదు. కస్టడీని పొడిగించుకుంటూనే వెళ్తోంది. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ ఢిల్లీలోనే మకాం వేసి కవితకి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ చూసుకుంటున్నారు. కవిత ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమె పరిస్థితిని చూసి అనిల్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారని సమాచారం. ఆ సమయంలో భార్యాభర్తలు మాట్లాడుకునే అవకాశం దొరికినప్పుడు, తాను ఈ నరకం ఇక భరించలేనని, అప్రూవర్ అయిపోతానని, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని కవిత భర్తని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కవిత అప్రూవర్ అవడం అంటే, నేను మద్యం కుంభకోణానికి పాల్పడ్డాను... విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని నేరాన్ని పూర్తిగా ఒప్పుకోవడం. ఇదే కుంభకోణంలో భాగస్వాములుగా వున్న కొంతమంది అప్రూవర్లుగా మారి హ్యాపీగా బయట తమ పనులు తాము చేసుకుంటున్నారు. అప్రూవర్‌గా మారడం అందరి విషయం వేరే.. కవిత విషయంలో మాత్రం వేరేగా వుంటుంది. కవిత అప్రూవర్‌గా మారితే, అది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తునే భస్మీపటలం చేసేస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి మానసికంగా చాలా దూరమైపోయారు. కవితగనుక అప్రూవర్‌గా మారడం అంటూ జరిగితే, ఇక బీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ సమాజం పట్టించుకోదు. కవిత భర్త అనిల్ కుమార్ కవిత అప్రూవర్ అవుతానని అంటున్నట్టు కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇదే ప్రతిస్పందన ఎదురైనట్టు తెలుస్తోంది. కవిత దారిన కవిత అప్రూవర్ అయిపోతే ఇక తమ పార్టీకి, తమ కుటుంబానికి తెలంగాణలో ఎంతమాత్రం విలువ వుండదని, కాబట్టి కవిత ఆలోచన కరెక్ట్ కాదని కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు వ్యతిరేకించినట్టు సమాచారం. అలా అయితే కవితను జైల్లోంచి బయటకి తెచ్చే మార్గమేదైనా మీ దగ్గర వుందా అని అనిల్ కుమార్ అడిగితే, వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రానట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా కవితను జైల్లోంచి బయటకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకపోతే కవితకు అప్రూవర్ అవడం తప్ప వేరే మార్గం లేదని అనిల్ కుమార్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/kavitha-as-approver-in-liquor-case-25-181574.html