మళ్లీ ఢిల్లీకి కవిత.. అరెస్టేనా?

Publish Date:Mar 14, 2023

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పుడు అందరి దృష్టీ ఈడీ దర్యాప్తుపైనే కేంద్రీకృతమై ఉంది. మరో రెండు రోజుల్లో (మార్చి 16) ఈడీ కవితను మరోమారు విచారించనుంది. తొలి సారి కవితను విచారించిన సందర్బంగా అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో హై డ్రామా నడిచింది.   ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో సౌత్ గ్రూపు పాత్రపై కవితను తదుపరి విచారణ సందర్భంగా లోతుగా ప్రశ్నించే అవకాశాలున్నాయని అంటున్నారు.  ఇప్పటికే ఈ కేసులో పలువురి వాంగ్మూలాలు రికార్డు చేసిన ఈడీ ఇక ముందు ముందు దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే సౌత్ గ్రూప్ ప్రమేయాన్ని పకడ్బందీగా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుందన్నది ఈడీ భావనగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పటికే కొంత మేర పురోగతి సాధించిన ఈడీ ఈ గ్రూపుతో సంబంధం ఉన్న అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి,  వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవను   అరెస్టు చేసింది. అలాగే ఇప్పటికే ఒక సారి విచారించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రెండో మారు విచారించనుంది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సౌత్ గ్రూపుదే కీలక పాత్ర అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన  ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు  కిక్‌బ్యాక్ రూపంలో ముడుపులు అందినట్టు కూడా నిర్ధారించుకుందని అంటున్నారు. ఆ సొమ్ము ఎలా చేతులు మారిందన్న విషయంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించిందని చెబుతున్నారు.  దీంతో మనీ లాండరింగ్   కోణంలో దర్యాప్తు జోరు పెంచింది.   బ్యాంకు స్టేట్‌మెంట్లు, కంపెనీల ఆడిట్ రిపోర్టులు, వ్యక్తిగత ఆస్తుల వివరాలు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన ఐటీ రిటర్నులు తదితరాలన్నింటినీ సమర్పించాల్సిందిగా సౌత్ గ్రూప్ సభ్యులకు చెబుతోంది. వాటి ఆధారంగానే విచారణ కొనసాగిస్తోంది.  ఆధారాలను ఒక్కొక్కరి ముందు పెట్టి విడివిడిగా విచారణ తరువాత ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి విచారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.  

అందులో భాగంగానే పిళ్లై కస్టడీని పొడిగించాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది  సౌత్ గ్రూపులోని వ్యక్తులను మనీ లాండరింగ్ కోణం నుంచి ప్రశ్నించాల్సి ఉన్నదని, ఈ గ్రూపులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా ఉన్న ఆడిటర్ బుచ్చిబాబును సైతం ఈ నెల 15న ప్రశ్నించడానికి నోటీసులు ఇచ్చామనీ, అలాగే పిళ్లైని అతనితో కలిసి విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.   వీటన్నిటినీ బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో రానున్న రోజులలో మరిన్ని అరెస్టులు అనివార్యమన్న భావనను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆ అరెస్టులలో కవిత అరెస్టు కూడా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.