పోటాపోటీ దీక్షలు.. అక్కడ కవిత.. ఇక్కడ కమలం!

Publish Date:Mar 9, 2023

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఢిల్లీలో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది  అయన రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మరో అవినీతి కేసులో అరెస్టయిన మరో మంత్రి సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు. ఆ ఇద్దరి స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషీ  సీఎం కేజ్రీవాల్‌  కేబినెట్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.  ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా వీరిద్దరితో  సీఎం కేజ్రీవాల్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. సిసోడియా నిర్వహించిన విద్యాశాఖతో పాటు  పబ్లిక్‌ వర్క్స్‌ విద్యుత్‌, పర్యాటక శాఖలను అతిషీ చూడనున్నారు. అలాగే, గతంలో జైన్‌ చూసిన వైద్య ఆరోగ్య శాఖతో పాటు పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమల శాఖలను ఇక నుంచి భరద్వాజ్‌ నిర్వహించనున్నారు. 

అంటే,ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రకంపనలు ఢిల్లీలో  పెద్దగా కనిపించడం లేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ కేసులు, ఆరోపణలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  చట్టం తనపని తాను చేసుకుపోతుందనే విధంగా  నింపాదిగా, తమ పని తాము చేసుకుంటున్నారు. ఒక విధంగా కేజ్రీవాల్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పట్లో ఎన్నికలు లేక పోవడం ఒకటైతే, స్కామ్  లో చిక్కున్న మాజీ మంత్రి సిసోడియా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు కాకపోవడం వలన మద్యం మరక గురించి ఆయన అంత పెద్దగా పట్టించుకున్నట్లు లేదని అంటున్నారు.   

కానీ, తెలంగాణలో మాత్రం రాజకీయం మొత్తం ఢిల్లీ మద్యం కేసు, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పాత్ర చుట్టూనే తిరుగుతోంది.  మరో వంక శనివారం(మార్చి10) అధికార బీఆర్ఎస్ విస్త్రుత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో ఉత్కంఠ చోటు చేసుకుంది. 

ఆలాగే  బీఆరేస్ ఎమ్మెల్సీ కవిత,  ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు బీజేపీ  సిద్ధమైంది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపడుతుండగా.. ఆమెకు దీటుగా హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొననున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. వీధుల కెక్కాయి.

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.