Publish Date:Sep 21, 2024
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుక్కున్న బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత దాదాపు ఐదున్నరనెలలు తీహార్ జైల్లో ఉన్నారు. కవితకు బెయిల్ లభించిన తర్వాతే ఆమె రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ గా పేరు గడించిన కవిత వచ్చే అక్టోబర్ మొదటి వారంలోనే రాజకీయాల్లో రీ ఎంట్రీ అని ప్రచారం జరుగుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో హల్ చల్ చేశారు. కవిత ఏం చెబితే అది జరిగేది. అవినీతి, అహంకారం తదితర కారణాలతో ఓటమి చెందిన బిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో అధోపాతాళానికి పడిపోయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఉద్దేశ్యంతో టిఆర్ఎస్ కాస్తా బిఆర్ఎస్ గా మారిపోయింది. ఇక్కడే బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ తప్పులో కాలేశారు. పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడేట్లు చేశారు. కూతురు, కొడుకు మధ్య ముఖ్యమంత్రి సీటు కోసం జరిగిన కొట్లాట వల్లే పార్టీ పేరు మార్చాల్సి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ను నిలువరించడానికి అన్నా చెల్లెళ్లు తాత్కాలికంగా విభేధాలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. కవిత జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు కెటీఆర్ జైలులో ములాఖత్ కార్యక్రమంలో కలిశారు. బెయిల్ పై వెలుపలికి వచ్చే సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికేటట్లు కెటీఆర్ జాగ్రత్త పడ్డారు. ఒక రోజు ముందే ఆయన ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
బతుకమ్మ పండగను దేశ విదేశాల్లో చాటి చెప్పిన కవిత మళ్లీ తన పూర్వ వైభవం కోసం తండ్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిఆర్ ఎస్ రాజకీయ మైలేజి కోసం కవిత ప్రయత్నిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే తనను లిక్కర్ స్కాంలో ఇరికించారని కవిత ప్రచారం చేయనుంది. నిజామాబాద్ కు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కవిత సమావేశమై రీ ఎంట్రీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavita--reentry-with-bathukamma-festival-25-185316.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.