సిదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసు.. కాశీబుగ్గ సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు.!

Publish Date:Jul 19, 2026

Advertisement

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో సంచలన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కుర్రోడు చిన్న యాక్సిడెంట్ చేస్తే అరెస్టు చేసేస్తారా? అంటూ వైసీపీ అధినేత జగన్ వెనకేసుకు వచ్చిన సిదిరి అప్పలరాజు కుమారుడు .. ఆరవ్ వర్మ  కు  కాశీబుగ్గ  సీఐ  రామకృష్ణ,   ఎస్సై  సునీల్ కూడా అండగా నిలిచారని వెల్లడైంది.  అరవ్ హిట్ అండ్ రన్ కేసులో   నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.  విశాఖపట్నం రేంజ్ ఐజీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.   నిందితుడికి  అనుకూలంగా వ్యవహరించి, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు.  

అరవ్ హిట్ అండ్ రన్ సంఘటన ఈ నెల 10న జరిగింది. ఆరవ్ వర్మ అతివేగంగా, అజాగ్రత్తగా ద్విచక్రవాహనాన్ని నడిపి. దానయ్య అనే గొర్రెల కాపరిని ఢీ కొనడంతో అతడు  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే..  ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు క్షేత్రస్థాయిలో కనీస విచారణ చేపట్టలేదు. పైగా మాజీ మంత్రి అప్పలరాజు ఒత్తిడికి తలొగ్గిన   పోలీసులు.. అసలు నిందితుడైన ఆరవ్ వర్మను రక్షించేందుకు కేసు  తప్పుదోవ పట్టించారు. ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ వివరాలను సాకుగా చూపి, ఆరవ్ స్నేహితుడైన సిద్ధార్థ్ అనే యువకుడిపై   కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.

 ప్రమాదం జరిగిన  మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ పోలీసులు కనీసం ఘటనా స్థలానికి వెళ్లకపోవడం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించకపోవడంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును తప్పుదోవపట్టించి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడిని రక్షంచే ప్రయత్నం చేశారని తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో   ప్రజాందోళన వెల్లువెత్తింది. దీంతో  ఉన్నతాధికారులు, ప్రభుత్వ  ఆదేశాలతో  దర్యాప్తు చేపట్టగా.. సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద లభ్యమైన సీసీటీవీ దృశ్యాలు ఈ కేసులో కీలక సాక్ష్యంగా మారాయి. ఆ సమయంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతోంది సిద్ధార్థ్ కాదని, మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ  సాంకేతిక ఆధారాలతో సహా రూఢీ అయ్యింది.

ఈ సాంకేతిక ఆధారాలు పక్కాగా లభించడంతో పోలీసులు వెంటనే ఆరవ్ వర్మను అరెస్టు చేశారు.   పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సహకరించిన నేరం కింద స్నేహితుడు సిద్ధార్థ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా..  ఈ దర్యాప్తు వ్యవహారం సమయంలో పోలీస్ స్టేషన్ లోని అంతర్గత సమాచారాన్ని స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు మాజీ మంత్రి అప్పలరాజుకు, ఆయన అనుచరులకు చేరవేసినట్లు కాల్ డేటా రికార్డుల  ద్వారా ఉన్నతాధికారులు గుర్తించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి దర్యాప్తును నీరుగార్చడం, నిందితులతో కుమ్మక్కవ్వడంతో  కాశీబుగ్గ సీఐ, ఎస్సైలపై వేటు పడింది.

ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత కేసును మభ్యపెట్టేందుకు చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.  స్థానిక ఎమ్మెల్యే  గౌతు శిరీషతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు బాధితుడి కుటుంబానికి అండగా నిలబడి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని వారు పట్టుబట్టడంతోనే ఈ కేసులో దాగిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై సునీల్ ను  వీఆర్ కు పంపించారు.  అంతర్గత విచారణలో లోపాలు మరింత స్పష్టంగా బయటపడటం, సీఐ స్థాయి అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో  ఇద్దరినీ సస్పెండ్ చేశారు.  

Seediri Appalaraju, Kasibugga hit and run case, SKLM News, Telugu One

By
en-us Political News

  
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.