Publish Date:Apr 26, 2025
కాశ్మీర్ పహల్గామ్ ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాలతో ఉంటున్నట్లు గుర్తించారు. రేపటిలోగా నగరం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్యనగరంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్థానీలను దేశం నుంచి వెళ్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలు రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తనిఖీలు చేపట్టి పాకిస్థానీలను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు ఇచినట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా (STV) హోల్డర్స్ గా ఉన్నట్లు గుర్తింపు. రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దవుతాయి డీజీపీ జితేందర్ తెలిపారు. మెడికల్ వీసా దారులకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kashmir-pahalgam-25-196969.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.