కాశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బీజేపీ హవా!
Publish Date:Oct 8, 2024
Advertisement
జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హర్యానాలోఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. మొదట కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. అటు జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి దూసుకెళ్తోంది. మధ్యాహ్నం 12.40 గంటల వరకు వెలువడిన ఫలితాల సరళిని చూస్తే.. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ ఆధిక్యం, గెలుపు స్థానాలు కలిపి బీజేపీ 48 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 35 స్థానాలకు పరిమితమైంది. ఐఎన్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి దూసుకెళ్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, బీజేపీ 28, పీడీపీ 2, కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ, బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/kashmir-and-haryana-results-25-186453.html





