Publish Date:Oct 30, 2023
తెలంగాణ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అంతా సిద్ధం చేసుకున్నాక.. పోటీ చేయొద్దని చంద్రాబాబు నిర్ణయించడం తనను బాధించిందని కాసాని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేయడం లేదని తాను కార్యకర్తలకు చెప్పలేననీ, అన్ని విధాలుగా ఎన్నికలకు వారిని సన్నద్ధం చేసిన తరువాత పోటీ లేదంటూ వారికి ముఖం చూపలేకే రాజీనామా చేశాననీ తెలిపారు.
ఈసారి పోటీ చేయాల్సిందే అని తెలంగాణలోని పార్టీ కేడర్ మొత్తం కోరుతోందని పేర్కొన్నారు. ఇలా ఉండగా కాసాని గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనీ, తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయకపోవడాన్ని సాకుగా చూపి రాజీనామా చేశారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా, కాసాని ఏ పార్టీలో చేరతారో అని ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో మాత్రం ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
అంతే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గంపగుత్తగా బీఆర్ఎస్ కు కట్టబెట్టేసేందుకు కాసాని జ్ణానేశ్వర్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఏఎస్ రావు ఆరోపించారు. తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయదన్న చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ క్యాడర్ కు చెప్పడానికి అన్న సాకుతో ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశాన్ని చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేక సమావేశంగా కాసాని మార్చేశారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ లో పార్టీ బలంగా లేదు. పైగా చంద్రబాబు జైలులో ఉన్నారు. ఇది పోటీ చేసే సందర్భం కాదు. అందుకే పోటీకి పెట్టి నాయకులను ఆర్దికంగా నష్టపరచకూడదన్న ఉద్దేశంతోనే పార్టీ ఈ సారి తెలంగాణలో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారని తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు నాయకులు భావిస్తుంటే.. వారిని పార్టీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి కాసాని ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kasani-resigns-telugudesham-39-164263.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.