దిల్లీని ఢీకొట్టిన ద్రవిడ దర్పం కరుణానిధి..!

Publish Date:Aug 7, 2018

Advertisement

ముత్తువేల్ కరుణానిధి... ఆధునిక తమిళ ఇతిహాసంలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం! దశాబ్దాలపాటు ద్రవిడ నేలను కనుసైగలతో శాసించాడు. అభిమానులు ఆయనను ఆరాధనతో 'కలైంగర్' అని కీర్తిస్తారు. అంటే కళాకారుడు అని అర్థం. ఆయన నిజంగానే రాజకీయ కళని ఔపోశన పట్టిన కళాకారుడు!

 

 

1969-2011 నడుమ మొత్తంగా ఐదు సార్లు తమిళనాడుకు సీఎంగా పని చేశారు. అయితే ఈ రాజకీయ చాణక్యుడు రాజకీయాల్లోకి రాకముందు కోలీవుడ్ సినీ పరిశ్రమలో సంభాషణల రచయిత! తమిళంలో ఆయన కథలు, నాటకాలు, నవలలు లాంటివెన్నో విరచించారు. తమిళ సాహిత్యంలో ఆయన పాత్ర అద్వితీయం!

1924లో బ్రిటీష్ కాలపు మద్రాస్ ప్రెసిడెన్సీలోని  తిరుక్కువలైలో కరుణ జన్మించారు. తమిళ నాయి బ్రాహ్మణ కుటుంబం ఆయనది. తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. జీవితకాల నాస్తికుడైన కరుణానిధికి తల్లిదండ్రులు పెట్టిన పేరు… దక్షిణా మూర్తి!

స్కూలు రోజుల్లోనే డ్రామా, కవిత్వం, రచనల్లో ఆయన ప్రతిభ ప్రదర్శించారు. జస్టిస్ పార్టీలో ప్రముఖ నాయకుడైన అళగిరిస్వామి ప్రసంగాలతో తరువాతి కాలంలో ఉత్తేజితుడయ్యాడు! 14వ ఏట నుంచే సామాజిక పోరాటాల వైపు ఆకర్షితుడయ్యాడు.

 

 

సినిమా రచయితగా 'రాజకుమారి' చిత్రంతో ప్రస్థానం ప్రారంభించారు కరుణానిధి. రాజకుమారి చిత్రంలో హీరో ఎంజీఆర్. అప్పుడు మొదలైన వారిద్దరి పరిచయం స్నేహంగా మారి చాలా కాలం పాటు కొనసాగింది. కానీ, రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం ఎంజీఆర్, కలైంగర్ దూరమయ్యారు. ఆ తర్వాత శివాజీ గణేషన్ సినిమాలతో పాటు మరెన్నో చిత్రాలకు కరుణానిధి రచయితగా పని చేశారు.

14 ఏళ్ల వయసులోనే కరుణ అళగిరిస్వామి స్ఫూర్తితో స్థానికంగా ఓ యూత్ సొసైటీని నడిపారు. ఆ తర్వాత 'తమిళనాడు తమిళ్ మనవర్ మండ్రమ్' అనే విద్యార్థి సంఘానికి ఊపిరిపోశారు. కళ్లకూడి టౌన్ పేరును దాల్మియాపురంగా మార్చడంపై జరిగిన పోరాటంలో డీఎంకే తరపున ఆయన పోరాడారు.

 

 

33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున ఆయన తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే కోశాధికారిగా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు.

1969లో అన్నాదురై చనిపోయాక తమిళనాడు ముఖ్యమంత్రి అయిన కరుణానిధి డీఎంకే తొలి అధినేత కూడా! పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై తాను ఉన్నంత కాలం అధ్యక్ష పదవిని  ఖాళీగా ఉంచేవారు. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే పిలవబడేవారు. అలా డీఎంకే ఫస్ట్ ప్రెసిడెంట్ అనిపించుకున్నది కూడా కరుణనే! అంతే కాదు తమిళ సినీ సెలబ్రిటీ సీఎం అవ్వటం కూడా కలైంగర్ తోనే మొదలైంది!

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలపు పరీక్షా సమయంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఆమెను వ్యతిరేకించలేదు. తమిళనాడులోని డీఎంకే మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టింది. ఆ సందర్భంగా ఎంతోమంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనతా పార్టీతో కరుణ జతకలిశారు. దీనికి కొన్నేళ్ల ముందే పార్టీ నుంచి ఎంజీఆర్ ను కరుణ బహిష్కరించారు. దీంతో, అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ స్థాపించారు. ఎమర్జెన్సీ తర్వాత జరగిన ఎన్నికల్లో డీఎంకే ఓడిపోగా, అన్నాడీఎంకే విజయం సాధించింది. 1987లో ఎంజీఆర్ చనిపోయేంత వరకు పలు ఎన్నికల్లో డీఎంకే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినా నిరంతర ఓటముల్లో కూడా కరుణానిధి పట్టుదలగా, తెలివిగా పార్టీని నడిపారు. నిబెట్టారు.

 

 

తమిళ చరిత్రలో సీఎంగా కలైంగర్ శకం….

    1969 ఫిబ్రవరి 10 నుంచి 1971 జనవరి 4వ తేదీ వరకు
    1971 మార్చి 15 నుంచి 1976 జనవరి 31 వరకు
    1989 జనవరి 27 నుంచి 1991 జనవరి 30 వరకు
    1996 మే 13 నుంచి 2001 మే 13 వరకు
    2006 మే 13 నుంచి 2011 మే 15 వరకు

కరుణను 1971లో అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో, తంజావూర్ యూనివర్శిటీ  'రాజ రాజన్' బిరుదుతో సత్కరించాయి. 2001లో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ జయలలిత డీఎంకే అధినేతను అరెస్ట్ చేయించింది. ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు కూడా కరుణానిధి మద్దతిచ్చారంటారు. 2009లో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడని స్వయంగా కరుణనిధే చెప్పటం గమనార్హం!

మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు ఈ తమిళ చాణుక్యుడు! పద్మావతి అమ్మాల్, దయాళు అమ్మాల్, రజతి అమ్మాల్ ఆయన భార్యలు. ముగ్గురు భార్యలతో ఆయనకు కలిగిన సంతానం…  ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు, సెల్వి, కనిమొళి…

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.