బీహార్ సీఎం నితీష్ కు బిగ్ షాక్.. మంత్రిపదవికి కార్తీక్ కుమార్ రిజైన్

Publish Date:Sep 1, 2022

Advertisement

ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గ కూర్పు పూర్తి చేసి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆయన కేబినెట్ నుంచి ఆర్జేడీకి చెందిన కార్తీక్ కుమార్ రిజైన్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ ఆర్జేడీకి చెందిన కార్తిక్ కుమార్ కు న్యాయశాఖ మంత్రి పదవి ఇచ్చారు.

అయితే ఆయనపై కిడ్నాప్ కేసు నమోదై ఉండటంతో నితీష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయశాఖ మంత్రిగా కార్తిక్ కుమార్ తనపై కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ  నేపథ్యంలోనే నితీష్ కుమార్ కార్తిక్ కుమార్ మంత్రిత్వ శాఖ మార్చారు. పెద్దగా ప్రాధాన్యత లేని చెరకు మంత్రిత్వ శాఖ ఇచ్చారు. దీంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. శాఖ మార్చిన వెంటనే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు.

చెరకు మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను నేరుగా గవర్నర్ కే పంపారు. ఆయన దానిని వెంటనే ఆమోదించారు. 2014లో జరిగిన ఒక కిడ్నాప్ కేసులో  నిందితుడిగా ఉన్న కార్తీక్ కుమార్ పై ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయశాఖ మంత్రిగా ఆయనను కొనసాగించడం భావ్యం కాదని తలచిన నితీష్ కుమార్ ఆయన శాఖను మార్చారు.

మామూలుగా చూస్తే ఇది సాధారణమే అనిపిస్తుంది కానీ బీహార్ లో సామాజిక సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే కార్తీక్ కుమార్ రాజీనామా సీఎం నితీష్ కుమార్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బీహార్ లో రాజకీయంగా శక్తిమంతమైన భూమిహార్లకు చెందిన కార్తీక్ కుమార్ నితీష్ పై అలకపూనడం ఆర్జేడీ, జేడీయూ బంధంపై అంటే పొత్తుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని బీజేపీ కార్తి కుమార్ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఆయనతో పాటుగా మహాఘట్ బంధన్ కూటమిలో మంత్రి పదవులు దక్కక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిపైనా బీజేపీ దృష్టి సారిస్తే నితీష్ కుమార్ కు చిక్కువు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.