కార్తీక మాసం ఎందుకంత విశిష్టమైనది!

Publish Date:Nov 13, 2023

Advertisement

తెలుగు క్యాలెండర్  ప్రకారం ఏడాదిలో ఉన్న 12మాసాలలో కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఆశ్వయుజ మాస  అమావాస్య నాడు వచ్చే దీపావళి మరుసటిరోజు నుండి కార్తీకమాసం మొదలవుతుంది.  ఇది తెలుగు క్యాలెండర్ లో ఎెనిమిదవ నెల. కార్తీకమాసంలో చాలామంది శివాలయ దర్శనం, దీపాలు వెలిగించడం, దైవభక్తిలో గడపడం చేస్తారు. అయితే కార్తీకమాసంలో కేవలం ఇవే ప్రధానం కాదు. కార్తీకమాసం ఎందుకంత గొప్పది? ఈ మాసం ప్రత్యేకత ఏమిటి? పురాణాలలో కార్తీకమాసం గురించి ఏం చెప్పబడింది? కార్తీకమాసంలో ఏ పూజ మంచిది?  వివరంగా తెలుసుకుంటే..

హిందూ క్యాలెండర్ లో కార్తీకమాసం చాలా విశిష్టమైనది. ఈ మాసం  విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం అంతా స్నానం, దానం, ధ్యానం, పూజలు మొదలైనవాటితో చాలా భక్తిపూర్వకంగా గడిచిపోతుంది. ఈ మాసం పుణ్యఫలాలను ఇస్తుందని సాక్షాత్తూ ఆ విష్టు భవనానుడే చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అన్ని మాసాలలోకి కార్తీక మాసం చాలా శ్రేష్టమైనదని బ్రహ్మ దేవుడు కూడా చెప్పినట్టు పురాణ కథలున్నాయి.  ఇకపోతే కార్తీకమాసంలో ఎవరైనా తీర్థయాత్రలు చెయ్యాలని అనుకుంటే దానికి నారాయణ తీర్థం లేదా బదరికాశ్రమం చాలా ఉత్తమమైనదని పండితులు, పురాణ కథనాలు చెబుతున్నాయి.

కార్తీక మాసం గురించి పురాణ గ్రంథాలలో ..

 "న కార్తీకసమో మాసో న కృతేన్ సమం యుగం
  న వేదం సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమం" అని ఉంది.

అంటే.. కార్తీకమాసం లాంటి మాసం లేదు, సత్యయుగం లాంటి శకం లేదు, వేదాల వంటి గ్రంథాలు లేవు, గంగ వంటి తీర్థం లేదు అని అర్థం.  కార్తీక మాసంలో దేవుడి అంశ బలపడుతుంది. ఈ మాసంలో విష్టుభగవానుడిని తులసితో పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు.  ఈ మాసంలో జ్ఞానం, లక్ష్మీ కటాక్షం కూడా పొందవచ్చు. కేవలం ఈ పూజలు మాత్రమే కాకుండా గంగాస్నానం, దీపదానం, యజ్ఞం, దానధర్మాలు చేయడం వంటివి చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.

నదీ స్నానం.. దీపాలు వదలడం వెనుక కారణం..

కార్తీక మాసంలో స్నానానికి పెద్ద  పీట వేస్తారు. పారే నీటిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగుతాయని, పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. అయితే నదీ స్నానం వెనుక ఉన్న ముఖ్య కారణం చూస్తే..

"శ్రేష్ఠో దేవాన మధుసూదన్
తీర్థ నారాయణాఖ్యాం హి త్రితాయాం దుర్లభం కలౌ ।"  అని స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ప్రకారం శ్రీమహావిష్ణువు నెలకొని ఉండే విష్టుతీర్థం లాగా కార్తీకమాసం కూడా  గొప్పది అని అర్థం.

ఇంకొక కారణం చూస్తే..  కార్తీక పూర్ణిమ రోజున మహదేవుడు లేదా పరమేశ్వరుడు త్రిపురాసుడు అనే రాక్షసుడిని సంహరించాడు. విష్ణుమూర్తి కూడా మత్స్య అవతారం ఎత్తాడు.  కార్తీకమాసం అంతా విష్ణువు మత్స్య అవతారంలో నీటిలో నివసిస్తాడు. అలాంటి పవిత్రమైన సమయంలో ఉదయాన్నే నీటిలో స్నానం చేయడం, నీటిలో దీపాలు వదిలడం చేస్తే పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీకమాసంలో గంగాస్నానం చేయడానికి దేవతలే భూలోకానికి వస్తారని కూడా అంటారు. అందుకే పారే నీటిలో స్నానం చేయడం పుణ్యప్రదం.

                                                 *నిశ్శబ్ద.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.