కర్నాటక ఫలితం సమీకరణాలను మార్చేసింది!

Publish Date:May 15, 2023

Advertisement

కర్నాటక ఫలితాల తరువాత   జాతీయ రాజకీయ సమీకరణాలపై చర్చ కొత్తగా తెరపైకి వచ్చింది. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయానికి ముందు వరకూ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అంటూ జరిగిన ఐక్యతా యత్నాలు ఇక నుంచి ఆ ఏతర జాబితా నుంచి అనివార్యంగా కాంగ్రెస్ ను తీసేస్తాయి. ఇకపై ఐక్యతా యత్నాలలో కాంగ్రెస్సేతర అన్న మాట వినిపించే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి.

2004 నుంచి యూపీఏ భాగస్వామ్య పక్షాులుగా ఉన్న అనేక పార్టీలు ఆ తరువాత వివిధ రాజకీయ కారణాలతో దూరమయ్యాయి. అయినా కూడా యూపీఏ కూటమి మనుగడ సాగిస్తూనే ఉంది. కానీ గతంలోలా ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ బలంగా లేదు. దీంతో పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీకీ, కాంగ్రెస్ కూ సమదూరం అంటూ కొత్త కూటమి ఏర్పాటు  దిశగా పావులు కదిపాయి.  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ఆద్మీ అధినేత కేజ్రీవాల్  వంటి వారు ఎవరికి వారుగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెససేతర కూటమి యత్నాలు చేపట్టినా అవి పెద్దగా ముందుకు సాగలేదు. డీఎంకే అధినేత స్టాలిన్ వంటి వారు  కాంగ్రెస్ లేని విపక్ష కూటమికి తావే లేదని కుండబద్దలు కొట్టేశారు. కర్నాటక ఫలితాల తరువాత కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తామంటూ వస్తున్న నాయకుల స్వరం మారుతోంది. అందరి కంటే ముందుగా తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ కు మద్దతుగా గొంతు విప్పారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. తొలి నుంచీ బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం అంటూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కేజ్రీవాల్ స్వరంలో కూడా మార్పు వస్తోంది. బీజేపీ దర్యాప్తు సంస్థల ద్వారా ఆప్ అస్థిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా చేస్తున్న ప్రయత్నాలు కేజ్రీవాల్ కు తత్వం బోధపడేలా చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇక యూపీలోని రెండు బలమైన పార్టీలు ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు కూడా బీజేపీయేతర కూటమికి మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాలలో ఇటీవలి కాలంలో బీఎస్పీ (బహుజనసమాజ్ పార్టీ) జాతీయ రాజకీయ యవనికపై పెద్దగా కనిపించడం లేదు. ఆ పార్టీ అధినేత్రి మాయావతి గళంలో పదను తగ్గిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే యూపీ రాజకీయాలను సన్నిహితంగా పరిశీలించేవారికి మాత్రం ఈడీ, సీబీఐ కేసుల భయమే మాయావతి మౌనానికి కారణమని అంటున్నారు. ఇప్పుడు కర్నాటక ఫలితం తరువాత ఆమె రాజకీయంగా మరింత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే మమత బెనర్జీతో కలిసి నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ యేతర కూటమి వైపే అఖిలేష్ యాదవ్ కూడా మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇక శరద్ పవార్, నితీష్ కుమార్, తేజస్వి ప్రసాద్ వంటి వారు ఇప్పటికే కాంగ్రెస్ తో కూడిన విపక్ష కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ముందు ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం అవుతాయి. కూటమిలోకి వచ్చి చేరే పార్టీల సంఖ్యా పెరుగుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక అందరి కంటే ముందుగా కాంగ్రెస్సేత, బీజేపీయేతర కూటమి, నాలుగో ఫ్రంట్ అంటూ గళం విప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనివార్యంగా ఇప్పుడు తన జాతీయ పార్టీని కూడా బీజేపీయేతర కూటమి పంచన చేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు.

బుధవారం (మే 17) ఆ పార్టీ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ విషయంలో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తం మీద ఒక్క విజయం.. ఔను ఒకే ఒక్క విజయం కాంగ్రెస్ గ్రాఫ్ ను అమాంతంగా పెంచేసింది. బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ సర్కార్ ను గద్దె దింపాలంటే కాంగ్రెస్సేతర అన్న విధానాన్ని వదులుకోకతప్పదని బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు స్పష్టంగా అర్ధమయ్యేలా చేసింది.  

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.