కర్ణాటకలో కొండచరియలు విరిగిపడి.. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి..!

Publish Date:Aug 2, 2026

Advertisement

 

కర్ణాటక వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మల్నాడు ప్రాంతంతో పాటు కొండ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వానల ధాటికి కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిద్రలోనే ఊపిరి వదిలారు. శివమొగ్గ జిల్లాలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో నిమిషాల వ్యవధిలోనే ఒక హాయిగా సాగుతున్న పేద కుటుంబం మట్టిదిబ్బల కింద సమాధి అయిపోయింది.బాధితుల వివరాల్లోకి వెళితే.. కొప్పల్ జిల్లా గంగావతి తాలూకా కొక్కరెగర గ్రామానికి చెందిన మల్లికార్జున్ (35) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి శివమొగ్గకు వచ్చారు. ఆయన తన భార్య నాగవేణి (28), మూడేళ్ల కుమారుడు సంతోష్ (3) లతో కలిసి ఇందిరానగర్ సమీపంలోని కొండ దిగువన నిర్మించుకున్న ఒక చిన్న రేకుల షెడ్డులో నివాసముంటున్నారు. 

శనివారం రాత్రి అంతా బయట ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పనులన్నీ ముగించుకుని కుటుంబమంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. అయితే తెల్లవారుజామున రాబోయే ప్రమాదాన్ని ఆ నిరుపేద కుటుంబం ఊహించలేకపోయింది.ఆదివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయాన వర్షపు నీటికి నానిన కొండ భాగం భారీ శబ్దంతో ఒక్కసారిగా విరిగిపడింది. భారీగా మట్టి దిబ్బలు, పెద్ద పెద్ద రాళ్లు కింద ఉన్న మల్లికార్జున్ రేకుల షెడ్డుపై పడ్డాయి. నిద్రమత్తులో ఉన్న ఆ కుటుంబం తేరుకునే లోపే రేకుల షెడ్డు పూర్తిగా నజ్జునజ్జై మట్టి కుప్ప కింద కూరుకుపోయింది. చిన్నారి సంతోష్‌తో సహా మల్లికార్జున్, నాగవేణిలు ఊపిరాడక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మూడేళ్ల పసికందు మట్టిక్రింద ప్రాణాలు విడవడం ఘటనా స్థలానికి చేరుకున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.ఈ ప్రమాద తీవ్రత పక్కనే ఉన్న మరొక రేకుల షెడ్డుపై కూడా పడింది. 

పక్క షెడ్డుపై పెద్ద రాళ్లు వచ్చి పడటంతో అందులో ఉన్న మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉలిక్కిపడిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అత్యవసర సేవల విభాగం, పోలీసు బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే రెస్క్యూ సిబ్బంది వెలికితీసి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.అనంతరం మట్టి కుప్పల కింద చిక్కుకుపోయిన మల్లికార్జున్ కుటుంబ సభ్యుల మృతదేహాలను వెలికితీసేందుకు జేసీబీల సాయంతో గంటల తరబడి శ్రమించారు. 

మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొండచరియలు విరిగిపడటంతోనే ఈ ఘోరం జరిగిందని శివమొగ్గ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు. మల్నాడు ప్రాంతంలో వర్షాలు మరింత ముదిరే అవకాశం ఉండటంతో కొండ దిగువన మరియు ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.ఈ విషాద సంఘటనతో మల్లికార్జున్ స్వగ్రామమైన కొక్కరెగరతో పాటు ఇందిరానగర్‌లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబాన్ని వర్షాల రూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

 Karnataka Landslide, Shivamogga Rain Disaster, Karnataka Rains Update, Landslide Kills Three, Indira Nagar Landslide, Malnad Heavy Rains

By
en-us Political News

  
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.