కర్నాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా

Publish Date:May 28, 2026

Advertisement

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా  చేశారు.  రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు పై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు  తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామాచేశారు. 2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం  కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే  విషయాన్ని   తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.

 ఈ ప్రకటనతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా , ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, కర్నాటక  కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం  సుగమమైంది. సిద్ధరామయ్య తన 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.  ఈ అల్పాహార సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సిద్ధరామయ్య, రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సమయంలో  ఒకింత  భావోద్వేగానికి లోనయ్యారు.

 ఇంతకాలం ముఖ్యమంత్రిగా నేను చేసిన పనుల పట్ల, ప్రజలకు అందించిన సేవల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం..  ముఖ్యంగా లోక్‌సభలో  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనలకు కట్టుబడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ కీలక సమావేశంలో సీనియర్ మంత్రులు ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, హెచ్‌కే పాటిల్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా  సిద్ధరామయ్య రాజీనామా  నిర్ణయాన్ని స్వాగతిస్తూ డీకే శివకుమార్ ఆయనను ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు. అనంతరం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ దృశ్యం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఐక్యతను చాటిచెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోను  కర్ణాటక కాంగ్రెస్   సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ..   ఐక్యతే మా బలం! ప్రజాసేవే మా నిరంతర లక్ష్యం అన్న వ్యాఖ్యను జోడించింది. సిద్ధరామయ్య రాజీనామా వార్త బయటకు రాగానే బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు ప్రారంభించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, బాణసంచా కాలుస్తూ  ఆనందాన్ని పంచుకున్నారు.  

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.