కర్ణాటక సీఎంను మళ్లీ మారుస్తున్నారా? బిట్ కాయిన్ స్కాం బొమ్మె కొంప ముంచుతుందా?

Publish Date:Nov 13, 2021

Advertisement

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పీఠం కదులుతోందా? కోట్ల రూపాయల ‘బిట్ కాయిన్’ కుంభకోణం, ముఖ్యమంత్రి మెడకు చుట్టు కుంటోందా? బీజేపీ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్  ను ఢిల్లీకి పిలిచింది అందుకేనా? అంటే కర్ణాటక రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు.  

అయితే ఇటు ముఖ్యమంత్రి బొమ్మై, అటు మాజీ ముఖ్యమంత్రి శెట్టార్ ఇద్దరూ కూడా  ముఖ్యమంత్రి మార్పు, ఉహాగానాలలో నిజం లేదని తేల్చేశారు. మరో వంక, బిట్ కాయిన్’ కుంభకోణం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పందించిన తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్త పరిచారు. ప్రధాని నరేంద్ర మోడీ బిట్ కాయిన్ వ్యవహారంలో విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని ముఖ్యమంత్రికి సూచించారని, ఇది సమంజసమా? అంటూ సిద్ద రామయ్య మండి పడుతున్నారు. అదేమైనా చిన్న చితకా  కుంభకోణమా, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా పట్టించుకోరా అంటూ సిద్దరామయ్య భగ్గుమన్నారు. 

“ఈ కుంభ కోణంలో ముఖ్యమంత్రి పాత్ర ప్రమేయం ఉందోలేదో నాకు తెలియదు. కేంద్ర, రాష్ట్ర విచారణ సంస్థలు ఈ కేసును విచారిస్తున్నాయి.. అలాంటి కేసు విషయంలో ముఖ్యమంత్రి కాకపోతే ఎవరు సమాధానం చెపుతారు” అంటూ సిద్హరామయ్య వరస ట్వీట్లు వదులు తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాన్నికూడా సిద్దరామయ్య  వ్యక్త పరిచారు. 

అదలా ఉంటే ముఖ్యమంత్రి బొమ్మై, తమ మంత్రి వర్గంలో ఎవరికీ ఈ కుంభకోణంతో సంబంధం లేదని,ఎవరినో కాపాడవలసిన అవసరం తమకు లేదని అన్నారు. అలాగే, తన కుర్చీకి వచ్చిన ముప్పు కూడా లేదని బొమ్మై ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకులు ఇది చాలా భారీ కుంభకోణమని, రూ. 2,600 కోట్ల నుంచి రూ.8,000 వరకు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. అయితే, అసలు కుంభకోణం ఏమిటి, అందులో ఎవరి పాత్ర ఏమిటో మాత్రం ఎవరూ చెప్పడం లేదని, ముఖ్యమంత్రి బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   కాంగ్రెస్ నాయకులు, నిరాధారంగా ఆరోపణలు చేయడం కాకుండా  తమ వద్ద ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వాలని ఎదురు దాడి చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినంత వరకు ఎనిమిది తొమ్మిది నెలల క్రిందటే, కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి అప్పగించడం జరిగింది. సిబిఐకి కూడా రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి, ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలను విచారణ సంస్థలకు ఇవ్వాలని, బొమ్మె అన్నారు. 

 ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి  శెట్టార్, వ్యక్తిగత పని మీద ఢిల్లీవచ్చానే కానీ, కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు రాలేదని స్పష్టం చేశారు. అయితే ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో మీడియా,రాజకీయ వర్గాల్లో ముఖ్యమంత్రి బొమ్మై మెడకు బిట్ కాయిన్ ఉచ్చు బిగుస్తోందని, ఆయనకు ఉద్వాసన ఖాయమని అంటున్నాయి. అయితే అంతిమంగా ఏమి జరుగుతుందో ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే అదొక చిక్క ప్రశ్నగానే ఉందని రాజకీయ్ విశ్లేషకులు అంటున్నారు. నిజంగానే, నాలుగు నెలలు అయినా కాకుండానే, బీజేపీ ముఖ్యమంత్రిని మారుస్తుందా లేదా బిట్ కాయిన్ కుంభకోణం టీ కప్పులో తుపానులా కనుమరుగై  పోతుందా ? చూడవలసి వుందని అంటున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.