బొమ్మై కన్నీరు కథేంటో ..?

Publish Date:Jun 14, 2022

Advertisement

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కన్నీరు పెట్టుకున్నారు. ఒక విధంగా ఆయన ఏడ్చేశారు. అయితే, ఆయన కన్నీరు పెట్టుకుంది, రాజకీయంగా ఏదో ఇబ్బంది వచ్చికాదు.  అవును గతంలో అప్పటి ముఖ్యమంత్రి కుమారా స్వామి, సంకీర్ణ ప్రభుత్వ సారధ్య కష్టాలు తట్టుకోలేక అనేక పర్యాయాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు శాసన సభలో కూడా సంకీర్ణ  భాగస్వామ్య పక్షం, తనను అడుగడుగునా అడ్డు తగులుతూ, అవమానాలకు గురి చేస్తోందని ఆయన సభలో కన్నీరు పెట్టుకున్నారు.అయితే, పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా, బీజేపీ కాంగ్రెస్, జేడీ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసి, గద్దె నెక్కి కూర్చుంది, అనుకోండి అది వేరే విషయం. 

అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మైకు కూడా రాజకీయ కష్టాలు లేక పోలేదు. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఇంకా నిండా సంవత్సరం అయినా పూర్తి కాలేదు. అయినా, ఇప్పటికే ఆయన కుర్చీ కిందకు నీళ్లోచ్చాయనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత యడ్యూరప్ప  ముఖ్యమత్రి  బొమ్మైకి పక్కలో బల్లెమై కూర్చున్నారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని, బొమ్మై వర్గీయులు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేయడం, విచారణలు జరగడం వంటి క్రతువంతా జరిగింది, జరుగుతూనే వుంది. అయితే, బొమ్మై కన్నీరుకు రాజకీయాలు కారణం కాదు. 

ఒక సినిమా, అందులో కుక్క పాత్ర  అయన చేత కన్నీరు పెట్టించాయి. ఒకే సారి ఐదు భాషల్లో విడుదలైన, ‘777 చార్లీ’ సినిమా చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఈ చిత్రం ఆయనకు, ఒక సంవత్సరం క్రితం చనిపోయిన  తన పెంపుడు కుక్కను గుర్తుచేసింది. ఆ ఉద్వేగంలోనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. 

ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘777 చార్లీ’ చిత్రం ఒక్క బొమ్మైని మాత్రమే కాదు, ఆ సినిమా చుసిన చాలామంది చేత కంటతడి పెట్టిస్తోంది. నిజానికి, కుక్కలంత విశ్వాసపాత్రమైన జంతువూ మరొకటి ఉండదని అంటారు. అది చాలా మందికి అనుభవంలో ఉన్న విషయమే, ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అదే. ఒక మనిషి, కుక్కకు  మధ్య అనుబంధాన్ని చక్కగా తెరకెక్కించిన చిత్రం ‘777 చార్లీ’. అందుకే ఈ చిత్రం ప్రేక్షకులను విరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని ముఖ్యమంత్రి బొమ్మై కూడా వీక్షించారు.

‘కుక్కల మీద ఎన్నో చిత్రాలు వచ్చాయి.కానీ ఈ చిత్రంలో ఒక జంతువులో ఉండే ఎమోషన్‌ను బాగా చూపించారు.అది కళ్లతోనే తన భావాలను పలికించింది.ఇది అందరూ వీక్షించాల్సిన చిత్రం. మనుషుల ప్రేమ కంటే కుక్క మనిషి పట్ల చూపే ప్రేమ షరతులు లేని ప్రేమ. అది స్వచ్ఛమైంది’ అంటూ ఆయన ఉద్వేగానికి గురయ్యారు. తన పెంపుడు కుక్క స్నూబీ గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కొద్దిరోజుల ముందు అది మరణించింది. ఆ కుక్కతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన కన్నీరు పెట్టుకున్నారు. 

అయితే, ఆయన ఎందుకు కనీరు పెట్టుకున్నా, బొమ్మై కన్నీరు మీద సోషల్  మీడియాలో , ‘మంచి నటుడే’ వంటి పొలిటికల్ కామెంట్స్ కూడా రాకపోలేదు. అయితే, ఈ సినిమా  ఒక్క బొమ్మైని మాత్రమే కాదు, భూతదయ ఉన్న ఎవరినైనా ఈ సినిమా కన్నీరు పెట్టిస్తుందని అంటున్నారు. అయితే మాత్రమేంటి, రాజకీయాలకు కాదేదీ అనర్హం, అనే కదా అంటారు.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.