వీర జవానుల విజయ కేతనం.. విజయ్ దివస్

Publish Date:Jul 26, 2022

Advertisement

 జూలై26, 1999, కార్గిల్ పర్వత ప్రాంతాలలో భారత సేనలు సాధించిన మహోన్నత విజయానికి ప్రతీక. ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ మాత్రమే కాదు, భారత సేనల అద్వితీయ ధైర్యసాహసాలు అత్యున్నత త్యాగాల విజయ గాధ మాత్రమే కాదు. దౌత్యపరంగానూ భారత దేశాన్ని అంతర్జాతీయ వేదికపై, బలీయమైన శక్తిగా నిలిపిన రోజు.అంతేకాదు, అంతర్జాతీయంగా మొదటిసారిగా పాకిస్థాన్ ను ఏకాకిని చేసిన రోజు. అలాగే,  ఉగ్రవాదాన్ని పోషిస్తున్న ఓ అప్రజాస్వామిక దేశంగా పాకిస్థాన్’  ప్రపంచ దేశాల్ ముందు దోషిగా నిలబెట్టిన రోజు.  

కార్గిల్ యుద్ధం, పుట్టు పుర్వోత్తరాలోకి వెళితే, పాకిస్థాన్ ప్రభుత్వం, అప్పటి ఆ దేశ అధ్యక్షుడు ముషారఫ్   కశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా చిత్రీకరించేసిన కుట్ర, పన్నిన పన్నాగం తప్ప మరేమే కాదు. కార్గిల్ యుద్దః అణు యుద్ధంమారే ప్రమాదం పొంచి ఉందనే భ్రమలు సృష్టించి, కశ్మీర్ వివాదంలోకి మూడవ దేశం తక్షణ జోక్యానికి అవకాశం కలిపించి, తద్వారా కశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా చిత్రీకరించాలని ముషారఫ్ ప్రధాన ఎత్తుగడ. అందుకోసమే, ఎల్‌ఓసీని ఉల్లంఘించి కార్గిల్‌లోని నియంత్రణ లేని ప్రాంతాలను ఆక్రమించాలి అనుకున్నారు. అయితే కార్గిల్ దాడి తర్వాత భారతీయ సైన్యం స్పందించిన తీరు పాకిస్థాన్ సైన్యం ఊహకు అందని విధంగా ఉండడంతో వారి ఆటలు సాగలేదు. 
వ్యూహాటకమైన కార్గిల్  పర్వత ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా సమీప భవిష్యత్ లో మొత్తం జమ్మూ, కాశ్మీర్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం పాకిస్తాన్ కుట్రపూరితంగా, దొంగచాటుగా దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాన్ని మన సేనలు అపూర్వమైన ధైర్యసాహసాలతో ఎదిరించారు. ప్రతికూలమైన పర్వత ప్రాంతాలలో మన సేనల పోరాట పటిమ మొత్తం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది.
ఆనాడు వాజపేయి, జార్జ్ ఫెర్నాండస్, జస్వంత్ సింగ్ – తిరుమూర్తుల నాయకత్వంలో మన ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించిన తీరు అనూహ్యం. 1971లో బాంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత మనం సైనికంగా, దౌత్యపరంగా సాధించిన మరో అసాధారణమైన విజయంగా చెప్పవచ్చు.  

 ఉగ్రవాదులతో పాటు వారి వేషధారణలో చొరబడి భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి కార్గిల్ కొండలను ఆక్రమించిన పాక్ సైనికులను భారతీయ సైనికులు తుదముట్టించారు. అణ్వాయుధ దాడి వంటి తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న భయంతో కూడా భారతదేశాన్ని భయపెట్టలేమని యావత్ ప్రపంచ సమాజం గ్రహించేటట్లు చేయగలిగారు. దేశ  ఐక్యత, సమగ్రతను రక్షించే సమస్యలపై ప్రపంచంలోని ఏ అగ్రరాజ్యం ఒత్తిడికి లేదా ప్రభావానికి భారత్ లొంగబోదని స్పష్టం చేశారు.  
కార్గిల్ యుద్ధం పాకిస్థాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే రాజ్యంగా పూర్తిగా బహిర్గతం చేసింది. కార్గిల్ దాడిపై తనకు ఎలాంటి సమాచారం లేదని  పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పగా, షరీఫ్‌కు అన్నీ తెలుసని ఆర్మీ చీఫ్ ముషారఫ్ పేర్కొంటూ దొంగాట ఆడారు.  

కార్గిల్‌ గురించి షరీఫ్‌కు తెలుసో, తెలియదో గాని పాక్ సేనలకు తిరిగి భారత్ పై యుద్దానికి దిగలేని విధంగా గుణపాఠం చెప్పారు.  సైన్యం చేసిన ఈ దుశ్చర్య గురించి ప్రధానికి నిజంగా తెలియకపోతే, పాకిస్థాన్‌కు సైన్యం లేదు, సైన్యంలో పాకిస్తాన్ ఉంది అని స్పష్టం అవుతుంది.మొత్తానికి ఈ దుస్సాహసం పాకిస్తాన్ ను జటిలమైన సంకటంలో పడవేసింది. మే 17న పాక్ సేనలు కార్గిల్ పర్వతాలపైకి చొచ్చుకు పోయేవరకు తనకు ఈ దాడి గురించి తెలియదని ఆ దేశం విదేశాంగ మంత్రి కూడా కలత చెందారు.పాకిస్తాన్ సైన్యంలో ఇంతటి గందరగోళం అంతకు ముందెన్నడు కలుగలేదు.
భారత్ అనుసరించిన అసాధారణమైన దౌత్య వ్యూహం కారణంగా  కార్గిల్ శిఖరాల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ప్రపంచంతో పాటు తమకు బాసటగా మరోవైపు నుండి భారత్ పై యుద్దానికి దిగుతుందని అనుకున్న  చైనా కూడా సేనలను వెనుకకు తీసుకెళ్లామని ఒత్తిడి చేయడంతో పాకిస్తాన్ దిగ్భ్రాంతి చెందింది. 
కార్గిల్‌లో పోరాడుతున్న తమ సేనలు కాదని, ముజాహిదీన్‌లు అని మొదట పాకిస్తాన్ ప్రపంచానికి అబద్ధం చెప్పింది, కానీ ప్రపంచ ఒత్తిడిలో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పిలిచినప్పుడు,  వారి కుట్ర ఏమిటో  ప్రపంచానికి బట్టబయలైంది. పాకిస్తాన్ ముజాహిదీన్లను నియంత్రిస్తున్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలు వాస్తవమని మొత్తం ప్రపంచం గ్రహించింది.  

ముజాహిదీన్‌ పేరుతో కశ్మీర్‌ లోయలో పాక్‌ ఉగ్రరూపం దాల్చిందన్న వాస్తవం కూడా ప్రపంచ దేశాలకు అర్థమయింది.  అంతర్జాతీయ వత్తిడి పెరగడంతో దిక్కులేక కార్గిల్ ఎత్తైన శిఖరాలలో పర్వేజ్ ముషారఫ్ తమ సేనలను దిక్కులేనివారిగా వదిలివేశారు. 

ఆవిర్భవించినప్పటి నుంచి పాకిస్థాన్‌లో జవాబుదారీ వ్యవస్థ అంటూ  లేదు. అరాచకమే రాజ్యమేలుతుంది.  ఇంత పెద్ద పొరపాటుకు కారణమైన ఆర్మీ చీఫ్ ముషారఫ్ ఆ తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు కావడమే అందుకు నిదర్శనం.  ఏమైతేనేమి, కార్గిల్ విఫల రాజ్యానికి మరో విఫల ప్రయత్నమని నిరూపించబడింది.  1965, 1971 యుద్ధాలలో ఓడిపోయినా పాకిస్తాన్  సైన్యం తన  దుర్మార్గపు ఆలోచన మారలేదు. 1999 కార్గిల్ యుద్ధానికి ముందు రెండుసార్లు, పాకిస్తాన్ సైన్యం కార్గిల్ వైపు నుండి భారత్‌పై దాడికి విఫల విఫల ప్రయత్నం చేసింది.. మూడవ ప్రయత్నంలో యుద్దంలో ఓడి పలాయనం చిత్తగించింది.

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.