అప్పు దొరికితేనే కాపు నేస్తం!

Publish Date:Aug 19, 2023

Advertisement

ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తామని చెప్పి పెండింగ్ ఉన్న పథకాలు చాలా చాలా  ఉన్నాయి. కొన్ని పథకాల   అమలు యోచన ఇప్పటికీ జగన్ సర్కార్ చేయడం లేదు.  మరికొన్ని పథకాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా బటన్ నొక్కినా నిధులు లేక  అవి మరుగున పడిపోతున్నాయి.   ఇలా పెండింగ్ లో ఉన్న పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని మాత్రం రానున్న ఎన్నికలలో కీలకం కానున్నాయి. దీంతో  వాటిని ఎలాగైనా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నది. కానీ తీవ్ర నిధుల కొరత, ఎంత ప్రయత్నించినా అప్పులు పుట్టని పరిస్థితిలో ఏం చేయలో తోచక జుట్టు పీక్కుంటోంది.  

అలాంటి పథకాలలో  అత్యంత ముఖ్యమైనది  కాపు నేస్తం. ఈ పథకం అమలు చేయడం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి చావో రేవోగా మారింది. ఈ నాలుగేళ్ళలో జగన్మోహన్ రెడ్డి కాపులకు చేసింది నిండు సున్నా. గత ప్రభుత్వంలో ప్రతిపాదించి, దాదాపు అనుమతి వచ్చిన కాపు రిజర్వేషన్లకు కూడా జగన్  గుండుసున్నా కొట్టేశారు.  ఇప్పుడు ఎన్నికల ముంగిట   పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటే..  ఆ ప్రయత్నాలు ఫలించకుండా చేసేందుకు  కొట్టే వైసీపీ ఎలాగైనా కాపు నేస్తం తీసుకురావాలని చూస్తున్నది. ఇందు కోసం జగన్ సర్కార్ ఇప్పటికే ఈ నెలలో ముహూర్తం ఖరారు చేసేసింది కూడా. అయితే   గత నెలలో వచ్చిన ఆదాయం, చేసిన అప్పు కూడా  జీతాలు, పెన్షన్లకే సరిపోని పరిస్థితి. ఇప్పటికీ ప్రభుత్వోద్యోగులందరికీ జీతాలు అందలేదు.

దీంతో   కాపు నేస్తం అమలు చేయడానికి  నిధులు లేకుండా పోయాయి. దీంతో  అల్పపీడనం, భారీ వర్షాల నెపంతో  కాపు నేస్తం వాయిదా వేశారు.  అయితే  ఎక్కడా భారీ వర్షాల ఆనవాలు లేదు. అది పక్కన పెడితే బటన్ నొక్కి ఖాతాలలో సొమ్ము జమ చేయడానికి వాతావరణంతో సంబంధం ఏమిటన్న ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానమే లేదు.  కాపు నేస్తం పథకం అమలుకు ఈ నెలలోనే మరో ముహూర్తం ఖరారు చేస్తామని ప్రకటించి  చేతులు దులిపేసుకున్నారు. అయితే ఈ నెలలో మరో ముహూర్తం ఖరారు చేసి జగన్ బటన్ నొక్కాలన్నా ఆదాయం ఎక్కడ నుంచి సమకూరుతుంది? అప్పు ఎక్కడ పుడుతుంది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.   నిజానికి ఇప్పటికే ఏపీ చేయాల్సిన అప్పు కంటే రెట్టింపు చేసేసింది. కనుక ఒక్క రూపాయి అప్పు కూడా పుట్టే అవకాశం లేదు.  కేంద్రం కూడా ఈ విషయాన్ని ఏపీ పెద్దలకు క్లియర్ గా చెప్పేసింది.  

కానీ, ఏపీ నుండి  కేంద్రానికి విన్నపాలు మాత్రం ఆగడం లేదు. గతంలో కూడా కేంద్రం ఇలాగే  ఇక అప్పు కుదరదని ఖరాకండీగా చెప్పినా.. తిమాలాడుకొని, బామాలుకుని, కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని ఎలాగోలా తిప్పలు పడి అప్పులు తెచ్చింది. ప్రభుత్వం రాయతీలు తగ్గించినట్లుగా చూపించి మసిపూసి మారేడుకాయ చేసి మరీ కొత్త అప్పులు తెచ్చింది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు కూడా అందులో భాగమే. ఇప్పుడు కూడా అలాగే అనధికారికంగా అప్పుల కోసం కేంద్రం వద్ద చేతులు చాచి అడుక్కుంటోంది. ఏపీ లిక్కర్ బాండ్లను అమ్మి తమకు అప్పు ఇప్పించాలని కేంద్ర పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇక, తమకి ఏది కావాలంటే అది చేసి పెడుతున్న క్రమంలో కేంద్రం కూడా మాయ చేసో మతలబు చేసో కొత్త అప్పు ఇచ్చేసే అవకాశాలు  లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. 

అదలా ఉంటే.. కేవలం కొత్త అప్పుల కోసమే వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో ఒక హైలెవల్  లోన్ కమిటీని కూడా నియమించుకుంది. ఔను నిజం  అనధికారికంగా ఈ అప్పుల పనులను చక్కబెట్టేందుకు ఈ కమిటీ పనిచేస్తున్నదని అంటున్నారు. అసలు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో  ఏపీ ప్రజలకు తెలియదు. అయితే హస్తినలో ఉన్న ఈ హై లెవల్ లోన్ కమిటీగా చెప్పుకుంటున్న ఈ కమిటీ రాష్ట్ర ఆర్ధిక మంత్రి కనుసన్నల్లో పనిచేస్తున్నదని, ఎప్పుడు ఎంత కావాలో అంత అప్పు  ఎలా సంపాదించాలో, అందుకోసం ఏం చేయాలో ఈ కమిటీ చూసుకుంటున్నదని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కమిటీ ఈ కాపు నేస్తంకు కావాల్సిన నిధుల సేకరణ పనిలోనే ఉందని అంటున్నారు. ఏపీ లిక్కర్ బాండ్ల విక్రయం ద్వారా ఈ అప్పు సంపాదించాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ బివరేజర్స్ బాండ్లను సబ్ స్క్రైబ్ చేయడానికి ఇన్వెస్టర్లు ముఖం చాటేశారు.  మరి ఈ కమిటీ కొత్త అప్పు తెస్తుందా? జగన్ సర్కార్ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తుందా  అంటే.. పరిశీలకుల నుంచి ఏమో చూడాలి అన్న సమాధానమే వస్తోంది. 

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.