తూర్పు తీర్పే.. రాష్ట్రం తీర్పు!

Publish Date:May 20, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ సారి తూర్పు ప్రజల దీవెన ఎవరి ఉంది అంటే.. జిల్లాలో గెలపు ఓటములను ప్రభావితం చేయగలిగే రెండు సామాజిక వర్గాల మొగ్గు ఎటువైపు ఉందన్నది పరిశీలిస్తే సరిపోతుందంటున్నారు.

జిల్లాలలో కాపు, సెట్టిబలిజ సామాజిక వర్గాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రెండు సామాజిక వర్గాలలో శెట్టిబలిజ సామాజిక వర్గం బీసీల కిందకి వస్తుంది. సంప్రదాయకంగా శెట్టిబలిజలు అంటే బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు ఈ జిల్లాలో వారి మొగ్గు వేరే పార్టీవైపు మళ్లినా అది తాత్కాలికమే. ఎందుకంటే శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారిలో అత్యధికులు చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. వారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా నిలుస్తూ వచ్చింది. ఆదరణ వంటి పథకాల ద్వారా చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అలాగే రాజకీయంగా కూడా వారి ఎదుగుదలకు తెలుగుదేశం అండగా నిలిచింది. 

ఇక కాపు సామాజికవర్గం విషయానికి వస్తే.. ఈ సారి కాపు సామాజికవర్గం మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచింది. అంటే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఆ సామాజికవర్గం నిలి చింది.   ఒక అంచనా ప్రకారం కాపుసామాజిక వర్గ ఓటర్లలో 70శాతం మందికి పైగా ఈ సారి తెలుగుదేశం క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు కాపు నేతం పథకం లబ్ధిదారులైన మహిళలు కూడా ఈ సారి తెలుగుదేశం కూటమికే జై కొట్టారు.  2017లోనూ కూటమి ప్రభావం ఏమిటన్నది చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ బీసీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.   బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టారు. అయితే వాటి ద్వారా అందిన ఆర్థిక సహాయం ఏమీ లేదనుకోండి అది వేరే  విషయం.  

ఇక శెట్టిబలిజ సామాజిక వర్గంలో  గౌడ, యాత, ఈడిగ వంటి ఉపకులాల వారు ఆర్థికంగా ఒకింత మెరుగైన స్థితిలో  ఉంటారు. ఈ ఉప కులాలకు చెందిన వారంతా ప్రధానంగా  మద్యం వ్యాపారం అంటే బార్లూ, వైన్ షాపులు నిర్వహించే వారు. జగన్ మోహన్ రెడ్డి మద్యం విధానం కారణంగా వీరంతా బాగా దెబ్బతిన్నారు. కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట ప్రాతాలలో వీరి జనాభా ఎక్కువ.  అలాగే  పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు లలో కూడా వీరు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.  అదే విధంగా అనపర్తి, రాజమహేంద్రవరంలలో కూడా విరి ప్రభావం కనిపిస్తుంది. చివరి క్షణంలో కూటమిని దెబ్బ కొట్టేందుకు జగన్  జిల్లాలో శెట్టిబలిజలకు ఎక్కువ స్థానాలు కేటాయించడం ద్వారా వారి మద్దతు సాధించాలన్న ప్రయత్నం చేశారు.

రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గాలలో జగన్ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లిచ్చారు.  అదే సమయంలో   సీట్ల సర్దుబాట్ల కారణంగా  తెలుగుదేశం కూటమి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దగా సీట్లు కేటాయించడానికి అవకాశం లేకుండా పోయింది.  ఇది తమకు లాభిస్తుందని వైసీపీ ధీమాగా ఉంది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు  కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాలు తెలుగుదేశం కూటమివైపే ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొగ్గు తెలుగుదేశంవైపే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న  ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్‌ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి. 
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు  కాంగ్రెస్  పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు  నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్     నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.