సుప్రీం తీరు, తీర్పులు సరిగా లేవు.. కపిల్ సిబల్

Publish Date:Aug 8, 2022

Advertisement

కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు రంగం సిద్ధమౌతోందా? అన్న ప్రశ్నకు ఆయన సుప్రీం కోర్టు పై చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందించిన తీరు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తుంది.  పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం (ఆగస్టు 8)న జరిగిన సదస్సులో ఆయన సుప్రీం కోర్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అర్ధ శతాబ్దం పాటు పని చేసిన తనకు సుప్రీం కోర్టుపై ఇలా వ్యాఖ్యానించాల్సి రావడం బాధ కలిగిస్తోందనీ, అయినా సీనియర్ న్యాయవాదినైనా తాను కాకపోతే న్యాయవ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలను మరెవరు ప్రశ్నించగలరని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుల వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని తాను కోల్పోయానని చెబుతూ ఆయన ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన పలు తీర్పులను ఉటంకించారు.  

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న, సున్నితమైన కేసులన్నీ కొందరు న్యాయమూర్తల ముందుకే విచారణకు వెళుతున్నాయన్నారు. గుజరాత్‌ అల్లర్ల కేసులో... సిట్‌ దర్యాప్తులో లోపాలకు సంబంధించిన ఆధారాలన్నింటినీ   సమర్పించినా సుప్రీం కోర్టు ఏమీ చేయలేకపోయిందన్నారు.అలాగే... మనీలాండరింగ్‌ కేసుల విషయంలో ఈడీ విస్తృత అధికారాలను సుప్రీం సమర్థించడాన్నికూడా కపిల్ సిబల్ ప్రశ్నించారు.

ఓవైపు వ్యక్తుల గోప్యత హక్కును సమర్థిస్తూ... మరోవైపు దర్యాప్తు పేరుతో ఈడీ నేరుగా ఇళ్లల్లోకి వెళ్లడానికి కోర్టు అనుమతివ్వడం ఎంత వరకూ సమంజసమని కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఛత్తీస్ గఢ్‌లో ఆదివాసీల ఊచకోతపై స్వతంత్ర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టేయడం, అలాగే ధర్మ సంసద్‌ ప్రసంగాల కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఈ సందర్భంగా కపిల్‌ సిబల్‌ తప్పుబట్టారు.

అయితే కపిల్ సిబల్‌ వ్యాఖ్యలపై పలువురు న్యాయనిపుణులు, బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సిబల్ వ్యాఖ్యలను ఖండించారు. స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించే రాజ్యాంగ సంస్థలపై విమర్శలు సరికాదన్నారు. మనీలాండరింగ్‌ చట్టాన్ని యూపీఏ హయాంలో, సిబల్‌ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే తెచ్చారని, ఇప్పుడు ఆయనే ఆ చట్టాన్ని విమర్శిస్తున్నారని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ వ్యాఖ్యానించారు.

  సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు మహేశ్‌ జెఠ్మలానీ కూడా కపిల్ సిబల్ వ్యాఖ్యలను ఖండించారు. సిబల్ వంటి సీనియర్ న్యాయవాది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం అని  పేర్కొన్నారు. కపిల్ సిబల్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతివ్వాలని కోరుతూ పలువురు న్యాయవాదులు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ను కోరుతూ లేఖలు రాశారు. మొత్తం మీద సుప్రీం కోర్టు తీర్పును తప్పుపడుతూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి

By
en-us Political News

  
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.