బాబు ఇచ్చారు ..జగన్ తీసేశారు!

Publish Date:Feb 10, 2023

Advertisement

మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు. ముఖ్యంగా కాపు రాజకీయాల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కన్నా పేరు ప్రస్తావనకు రాకుండా ఉండదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్సార్ మంత్రి వర్గంలో ఉన్న కన్నా.. అప్పట్లోనే కాపుల రిజర్వేషన్ అంశంలో కీలక పాత్రను పోషించారు. కాపుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల అధ్యయనం కోసం కమిటి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యునిగానూ కాపుల రిజర్వేషన్ కోసం గట్టి కృషి చేశారు.

అయితే, వైఎస్సార ఆకస్మిక మృతి, తదనంతర పరిణామాల నేపధ్యంలో కాపుల రిజర్వేషన్ అంశం తెరమరుగైంది. కానీ, రాష్ట్ర విభజన అనతరం, 2014లో  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులకు న్యాయం చేశారు. కేంద్రం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చట్టం చేసింది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన  జగన్మోహన్ రెడీ (వైసీపీ) ప్రభుత్వం, కేంద్రం పై నెపం నెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది. కాపులకు అన్యాయం చేసింది. ఇదంతా చరిత్ర. 

ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశం మరోమారు చర్చకు వచ్చిన నేపధ్యంలో కన్నా చంద్రబాబు నాయుడు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేస్తే, జగన్ మోహన్ రెడ్డి  కేంద్రంపై నెపం నెట్టి ఆ చట్టాన్ని రద్దు చేశారు.  కాపులకు అన్యాయం చేశారు అని అన్నారు. మరో వంక  ఏపీ ముఖ్యమంత్రి జగన్  కాపుల రిజర్వేషన్  అంశాన్నే కాదు, కాపుల అభివృద్ధికి సంబందించిన ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారని కాపు నాయకులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు కాపుల వేలుతో కాపుల కంట్లో పొడిచేందుకు  జగన్  కుట్రలు చేస్తున్నారని కాపు నేతలు పేర్కొంటున్నారు. అందుకే రేపటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తెలుగుదేశంతో చేతులు కలిపి కాపులకు న్యాయం చేయాలని అంటున్నారు.

కాగా రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతున్న సమయంలో కన్నా చేసిన తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది. నిజానికి  కన్నా బీజేపీలో ఉక్కపోతకు గురవుతున్నారని అయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఆయన జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో  చర్చలు కూడా జరిపారు.  కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఈ విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ నేతతో సమావేశమైన కన్నా లక్ష్మీనారాయణ..  తాను పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టి వేశారు. కానీ ఇంతలోనే ఆయన కాపుల రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ కాపులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం న్యాయం చేస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా కాపులకు రిజర్వేషన్ దక్కకుండా చేసిందని ఆరోపించడంతో కన్నా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 

కన్నా  లక్ష్మి నారయణ  కాపు రిజర్వేషన్ విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పట్టడంతో పాటుగా బీజేపీ పట్ల కూడా  తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన కాపుల రిజర్వేషన్ చట్టం చెల్లు తుందని కేంద్ర తాజాగా చేసిన ప్రకటనను స్వాగతిస్తూనే  ఈ క్రెడిట్ ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ తమ ఖాతాలో వేసుకుని, సన్మానాలు చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తప్పు పట్టారు. కేవలం రాజ్య సభలో ప్రశ్న వేయడం మినహా, కాపుల రిజర్వేషన్ కు జీవీఎల్ చేసింది  ఏముందని ప్రశ్నించారు. పార్లమెంట్ లో జీవీఎల్ అడిగిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే గూగుల్‌లో కొడితే అర్థమైపోతుందంటూ సెటైర్లు వేశారు.

అలాగే  జనసేన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే అంశాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కే వదిలేయాలని కన్నా పేర్కొన్నారు. కన్నా చేసిన ఈ తాజా వ్యాఖ్యలను గమనిస్తే ఇక ఆయన బీజేపీలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే ఆయన టీడీపీ, జనసేన పొత్తును గట్టిగా సమర్ధిస్తూ పవన్ కళ్యాణ్  రాజకీయ నిర్ణయాల్లో ( టీడీపీతో పొత్తు)  బీజేపీ జోక్యం అనవసరమని పరోక్షంగానే అయినా బీజేపీ పెద్దలకు చురకలు అంటించారు. ఈ నేపధ్యంలో ఆయన జనసేన లేదా టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని, పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.