బీజేపీకి గుడ్ బై..తెలుగుదేశం గూటికి కన్నా?

Publish Date:Oct 19, 2022

Advertisement

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరనున్నారా? వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? అంటే బుధవారం వేగంగా సంభవించిన వరుస సంఘటనలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. అసలుఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.  

మంగళ వారం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను   కలవడం.. భవిష్యత్తులో కలిసి పని చేస్తామంటూ పొత్తుపై సంకేతాలు ఇవ్వడంతో ఏపీలో రాజకీయవేడి రగిలింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి రాగం భగ్గుమంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అసమ్మతి గళం విప్పారు. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ   సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ తానే అ న్నట్లు సోము వీర్రాజు వ్యవహరించడం వల్లే   ఈ పరిస్ధితి దాపరించిందని..  పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. జేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు.

ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు.

అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా తన ముఖ్య అనుచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. కన్నా వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టించాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సోము వీర్రాజు కన్నా వ్యాఖ్యలను పట్టించుకోవద్దంటూ క్యాడర్ కు చెప్పారు. కన్నా వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లారు.

ఇలా ఉండగా కన్నా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ హై కమాండ్ ఆయన ప చర్యలకు సిద్ధమైందని అంటున్నారు.   కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడాలని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతనే అసమ్మతి గళం విప్పారని అంటున్నారు.  ఉమ్మడి గుంటూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్న నాయకుడు, మాజీ మంత్రి అయిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తరువాత మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే ఆయన ఆ పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన తరువాత నుంచి పార్టీలో కన్నాకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. కాగా తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అంటే తీర్మానం చేసిన సంగతి ఆయన గుర్తు చేస్తున్నారు.

తన ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ రాజధానిగా అమరావతికి మద్దతుగా తీర్మానం చేయడం వల్లే తనను అప్పట్లో అధ్యక్ష పదవి నుంచి తొలగించారని కన్నా తన సన్నిహితుల వద్ద అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.    ఈ విషయంపై అనుచరులతో భేటీలో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్, ఆయన విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే కన్నా అధికార వైసీపీ గూటికి చేరే అవకాశం లేదు. అలాగే సొంత సామాజిక వర్గానికి చెందిన  పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన గూటికి చేరుతారా అన్న కోణంలో కూడా రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే. 

అమరావతి విషయంలో తెలుగుదేశం స్టాండ్ కు పూర్తి స్థాయిలో  మద్దతుగా నిలుస్తున్న కన్నా తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. తనకు, తన కుటుంబంలో ఒకరికి పోటీకి అవకాశం దక్కుతుందని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ఒక చర్చ అయితే నడుస్తోంది. తనకు, తన కుటుంబంలోని ఒకరికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశిసతున్న కన్నా,, నరసరావు పేట లోక్ సభ స్థానం సత్తెనపల్లి లేదా గుంటూరు వెస్ట్ నుంచి పోటీకి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా కన్నా లక్ష్మీ నారాయణ అసమ్మతి గళం విప్పడం బీజేపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనం సృష్టించింది.     

By
en-us Political News

  
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే విశాఖను గ్లోబల్ ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనే ఆలోచనతో ఈ భోగాపురం ప్రాజెక్టుకు చంద్రబాబు బీజం వేశారనీ, అయితే.. కాలక్రమంలో ప్రభుత్వాలు మారాయి, ప్రాజెక్టు ప్రతిపాదనలు మడతపడ్డాయన్నారు.
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.