క‌మ‌ల్ హాస‌న్ కన్నడ కాంట్రవర్సీ

Publish Date:May 30, 2025

Advertisement

నిజంగానే క‌న్న‌డ త‌మిళంలోంచి  వ‌చ్చిందా? 
ద‌క్షిణాది ప్రాచీన భాష‌లేవి! 

నిజానికైతే క‌న్న‌డ‌కు త‌మిళానికీ ఉన్న లింకు మాట  ఎలాగున్నా... తెలుగు క‌న్న‌డ‌కు మాత్రం చాలానే సంబంధ బాంధ‌వ్యాలున్న‌ట్టు క‌నిపిస్తాయ్. తెలుగులో ఒక‌టి- క‌న్న‌డ‌లో ఒందు అంటూ మొద‌లు పెడితే.. దాదాపు క‌న్న‌డ భాషకు తెలుగుకు విశేష సంబంధాలున్నట్టు క‌నిపిస్తుంది.

తేట తేట తెలుగు, క‌న్న‌డ క‌స్తూరి, సెంత‌మిళ్, మ‌ల‌యాళ మ‌నోర‌మ‌... ఇవీ ద‌క్షిణ ద్ర‌విడ భాష‌లు. ఇంత‌కీ ఈ ద్ర‌విడం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. ద్ర‌విడ భాష‌ల్లోకి త‌మిళ్ ముందా లేక క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళ భాష‌లా అని చూస్తే.. అస‌లు త‌మిళ్ అన్న‌ది ఎలా పుట్టిందో తెలుసుకోవ‌ల్సి ఉంటుంది..

ద్రవిడ‌మునకు పూర్వరూపము ద్రమిళమని అంటారు. ఇదే ద్రవిడముగ సంస్కృతమున నిలచిన‌ట్టు చెబుతారు. ప్రాకృత భాషల్లో తిరమడ, తిరమిళ, తమిళ అంటూ ఈ భాష అనేక‌ రూపాంత‌రాలు చెందిన‌ట్టుగా చెబుతుంది భాషా చ‌రిత్ర‌. ద్రమిళమే త‌మిళానికి మొద‌టి ప‌దం.  ద్రమిళ, ద్రవిడ, తిరమడ, తిరమిళ, తమిళ  శబ్దములు ధ‌ర్మ శ‌బ్దాల నుంచి వ‌చ్చాయ‌ని అంటారు.

దీంతో పాటు ద్ర‌విడ భాష‌ల్లో కూడా ర‌క‌ర‌కాలుంటాయి. ద్రావిడ భాషా కుటుంబంలో ప్రాధాన్య‌ తాంశాలేంట‌ని చూస్తే.. తొలుత త‌మిళ భాష‌- త‌ర్వాత‌ క‌న్న‌డ భాష‌ క‌నిపిస్తాయి. త‌ర్వాత‌ మధ్య ద్రావిడ భాషా కుటుంబం క‌నిపిస్తుంది. ఇందులో తెలుగు ప్ర‌ధాన  భాష‌. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం కురుఖ్ వంటి భాష‌లున్న‌ట్టు చెబుతంది మ‌న ద్ర‌విడ భాషా చ‌రిత్ర‌. అంటే ద్ర‌విడంలోనే అనేక భాష‌లు వాటికి గ్రెడేషన్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ అంత న‌మ్మ‌కంగా ఎలా చెప్ప‌గ‌లిగారంటే.. ద్ర‌విడ భాష‌ల పెద్ద‌న్న త‌మిళం. త‌ర్వాతే క‌న్న‌డ‌. ఆ త‌ర్వాత మ‌ల‌యాళం, ఆపై ఇత‌ర భాష‌లు.

అందుకే ఆయ‌న అంత గ‌ట్టిగా త‌న‌కు చ‌రిత్ర కారులు చెప్పార‌ని గట్టిగా అంటున్నారు. నిజానికైతే తెలుగు క‌న్న‌డ ద‌గ్గ‌ర ద‌గ్గ‌రగా ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి. ఆ భాష రాత‌లోగానీ పిలుపులోగానీ ఆ సొబ‌గు ఈ రెండింటి మ‌ధ్యే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. మీరు కావాలంటే  చూడండీ.. క‌న్న‌డ వాళ్ల‌తో తెలుగు మాట్లాడి  నెగ్గుకు రాగ‌లం. త‌మిళ‌వాళ్ల ముందు మ‌ల‌యాళం మాట్లాడి నెగ్గుకు రాగ‌లం. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటిది త‌మిళానికీ క‌న్న‌డానికీ సంబంధ‌మేంట‌న్న‌ది అర్ధంకాని చిక్కు ప్ర‌శ్న‌. అస‌లు ద్ర‌విడం అంటేనే బౌద్ధ ధ‌ర్మంలోంచి పుట్టింద‌నీ.. ఆ ధ‌ర్మ‌మే ద్ర‌విడంగా త‌ర్వాత త‌మిళంగా పుట్టుకొచ్చింద‌ని మ‌న‌కు చెబుతోంది భాషా చ‌రిత్ర‌. 

ద్ర‌విడ భాష‌లు దాని వంశ వృక్షం విష‌యానికి వ‌స్తే.. మూల ద్రావిడ భాష దాన్లోంచి ఉత్త‌ర ద‌క్షిణ భాష‌లు పుట్టుకొచ్చాయి. వాటిలో ద‌క్షిణ భాషల్లోంచి త‌మిళం పెద్ద‌న్న‌గా ఉండ‌గా క‌న్న‌డ అందులోంచి పుట్టుకొచ్చిన మ‌రో కొమ్మ‌లా క‌నిపిస్తుంది. ఈ కోవ‌లోనే మ‌ల‌యాళం కూడా పుట్టుకొచ్చిన‌ట్టు తెలుస్తుంది.  అంటే త‌మిళ‌మే ఈ భాష‌ల‌న్నిటికీ  హెడ్ క్వార్ట‌ర్.

మ‌రి క‌న్న‌డిగుల‌కు ఈ విష‌యం తెలీదా? ఎందుక‌ని క‌మ‌ల్ హాస‌న్ లేటెస్ట్ మూవీ థ‌గ్స్ అండ్ లైఫ్.. సినిమాతో పాటు ఇత‌ర చిత్రాలేవీ ఆడ‌నివ్వ‌మంటున్నారు.. ఇందుకు రీజ‌న్లు ఏమై ఉంటాయ్? అని చూస్తే ఆత్మ‌గౌర‌వ ప్ర‌శ్న‌. ఎవ‌రికి వారు మేమంటే మేమే గొప్ప అనుకుంటారు. అలాంటిది వాళ్ల‌కు వాళ్లు గొప్ప‌. క‌న్న‌డిగుల‌కు అస‌లే ఆత్మాభిమానం ఎక్కువ‌. 

ఇప్ప‌టికే కావేరీ స‌మ‌స్య ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఎప్ప‌ట్నుంచో ఉంది. కావేరీ న‌ది పుట్టింది క‌ర్నాట‌క‌లోని త‌ల‌కావేరీ ప్రాంతంలో. అక్క‌డి నుంచి అది త‌మిళ‌నాడు దిశ‌గా ప్ర‌వ‌హించి బంగాళా ఖాతంలో క‌లిసేది తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల మ‌ధ్య గ‌ల ఈ గొడ‌వ ఇప్ప‌టిది కాదు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రాక పోవ‌డానికి గ‌ల ప్ర‌ధాన‌ కార‌ణం కూడా ఇదే. 

ర‌జ‌నీ(మ‌రాఠీ అయిన‌ప్ప‌టికీ) పుట్టింది క‌ర్ణాట‌క‌లో.... ఎంతైనా పుట్టిన ప్రాంత అభిమానం అంటూ ఒక‌టి ఉంటుంది కాబ‌ట్టి.. ఆయ‌న్ను త‌మిళులు రాజ‌కీయ పార్టీ పెట్ట‌నివ్వ‌లేదని అంటారు. ఆయ‌న కూడా ఎందుకొచ్చిన గొడ‌వ అంటూ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అదే క‌మ‌ల్ హాస‌న్ త‌న మ‌క్క‌ల్ నీతి మ‌య్యం అనే పార్టీ స్థాపించి.. డీఎంకేతో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు కూడా వెళ్తున్నారు. అది వేరే విష‌యం అనుకోండి. త‌మిళ క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కున్న గొడ‌వ‌లు ఈనాటివి కావు.. కావేరీ జ‌లాల విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఇప్ప‌టికే కొన్ని ప‌దుల సంఖ్య‌లో గొడ‌లు జ‌రిగాయ్.

ఎప్ప‌టి నుంచో క‌న్న‌డిగుల‌కు మ‌రో  స‌మ‌స్య కూడా ఉంది. త‌మ సినిమాలు ఇత‌ర భాష‌ల డ‌బ్బింగ్ సినిమాల ముందు తేలిపోతున్నాయ‌ని భావించిన వీరు డ‌బ్బింగ్ చిత్రాల‌పై బ్యాన్ విధించారు. ఈ బ్యాన్ ని ఎప్పుడెప్పుడు అమ‌లు చేద్దామా? అని చూస్తున్న వారికి క‌మ‌ల్- క‌న్న‌డ కామెంట్స్ మ‌రింత కాక పుట్టించాయ్. దీంతో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఎలాగైనా వాడుకోవాల‌న్న‌ది ఇంకో ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.