Publish Date:Jul 22, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరిగే నేపథ్యంలో ఒకవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో వున్నారు. ట్రంప్ అసలే కోతి.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ఇటీవలే ఆయన చెవిని బుల్లెట్ ముద్దుపెట్టుకుంది. దాంతో ఈసారి విజయం తనదేనని ఆయన ధీమాగా వున్నాడు. ట్రంప్ దూకుడుని బైడన్ తట్టుకోలేడని భావిస్తూ డెమెక్రటిక్ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో బైడన్ని తప్పుకోవయ్యా మహాప్రభో అని చెవి దగ్గర జోరీగల్లా మోగుతున్నారు. వారిలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా వున్నారు. అలా అందరూ మొత్తుకోవడం వల్ల అయితేనేమి, తనకు ఈసారి అంత దృశ్యం లేదని తానే అర్థం చేసుకోవడం వల్ల అయితేనేమి బైడన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన తప్పుకుంటూ తప్పుకుంటూ.... అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఉపాధ్యక్షురాలు, భారత మూలాలున్న కమలా హ్యారీస్ని రికమండ్ చేశారు. ఆయన రికమండ్ చేసినంత మాత్రాన అంత ఈజీగా కమలా హ్యారీస్ అభ్యర్థిత్వం ఖరారు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కమలా హ్యారిస్ని బైడన్ ఇలా రికమండ్ చేశాడో లేదో అలా ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. బైడెన్ కంటే కమలాని ఓడించడమే ఈజీ అని ప్రకటించేశాడు.
అదేవిధంగా, నిన్నటి వరకూ బైడెన్ అభ్యర్థిత్వాన్ని బరాక్ ఒబామా వ్యతిరేకిస్తూ వస్తున్నది, ఆయన్ని తప్పుకోవాలంటూ సూచిస్తున్నది పార్టీ క్షేమం కోసం అని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ, ఆయన ఆలోచిస్తున్నది తన భార్య మిఛెల్లీ ఒబామా క్షేమం కోసం అనే విషయం లేటెస్టుగా అర్థమైంది. అధ్యక్ష అభ్యర్థి విషయంలో పార్టీ నుంచి అనూహ్యమైన నిర్ణయం వెలువడబోతోంది అని ఆయన ప్రకటించారు. అంటే, బైడెన్ రికమండ్ చేసిన కమలా హ్యరిస్కి గట్టి పోటీనే ఉందన్నమాట. ఒబామా కూడా తక్కువ వాడేమీ కాదు కదా.. తన భార్య అభ్యర్థిత్వాన్ని ఓకే చేయించుకునేందుకు పార్టీ కీలక నాయకులతో మంతనాలు జరుపుతున్నాడు. కమలా హ్యారిస్ కూడా ప్రస్తుత ఉపాధ్యక్షురాలి హోదాలో తన లాబీయింగ్ తాను చేస్తున్నారు. అసలు పోటీకి ముందు ఈ కొసరు పోటీలో కమలా గెలుస్తారా? మిఛెల్లీ గెలుస్తారా అనేది వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kamala-harris-michelle-obama-39-181220.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.