కమల్.. అంత మాట అనేశావ్..!
Publish Date:Nov 2, 2017
Advertisement
ఇప్పుడు రాజకీయాలు మతం రంగు పూసుకొని రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. మతం రాజకీయం కలగలిసి పోయి మతరాజకీయంగా ప్రాణం పోసుకున్నాయి. పార్టీల మధ్య వైరం మత వైరుధ్యంగా మారుతున్నది. ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడితే చాలు అది పెద్ద దుమారమే రేపుతుంది. అంతేకాదు ఆ నేతకు తమ సత్తా ఏంటో కూడా చూపిస్తారు ఆ మతస్థులు. అందుకే రాజకీయ నాయకులు మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఆ విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నాడు కమల్ హాసన్. ఇంకా పూర్తి స్థాయి రాజకీయాల్లోకే అడుగుపెట్టలేదు.. అప్పుడే కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన కమల్ ఇప్పటికీ దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కొత్త పార్టీ పెడతాడా...? లేక ఏదైనా పార్టీలోకి ఎంట్రీ ఇస్తాడా..? ఈ విషయాలపై ఎటువంటి క్లారిటీ లేదు. పోనీ బీజేపీ పార్టీలో చేరుతాడా అంటే... ఇంతకు ముందు వరకూ బీజేపీకి సపోర్టు ఇచ్చిన కమల్... ఎప్పుడైతే తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పాడో.. అప్పటినుండి బీజేపీ కి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం మొదలుపెట్టాడు. దీంతో కమల్ ఒకవేళ పార్టీ పెట్టకపోయినా.. బీజేపీలోకి వెళ్లడన్న విషయం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కమల్ మరోసారి బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందని ఆరోపిస్తూ, ఉత్తరాదిన ఈ టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పించాడు. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో కేరళ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని కితాబిచ్చాడు. హిందూ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అరికట్డంలో యూపీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా విఫలమైందని అన్నారు. మరి ఇంకా రాజకీయాల్లోకి రాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కమల్ ముందు ముందు ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హిందూ మతాన్ని ఏకంగా ఉగ్రవాదంతో పోల్చడంవల్ల ఇది ఎంత దుమారం రేకెత్తిస్తుందో... కమల్ రాజకీయం భవిష్యత్ ఏమవుతుందో చూద్దాం....
http://www.teluguone.com/news/content/kamal-hassan-39-78598.html





