తమిళనాడు సీఎం విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత.. ఏం చేశారంటే?

Publish Date:Aug 21, 2026

Advertisement

తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేతత్రి కల్వకుంట్ల కవిత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను అనుసరిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగిన తొలి ప్రయత్నంలోనే  ఘన విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించిన టీవీకే అధినేత విజయ్ అడుగు జాడల్లో నడుస్తూ కవిత కూడా తెలంగాణ రక్షణ సేనను గెలుపు బాటలో నడిపించి తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. 

ఇందుకోసం ఆమె తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.  తమిళనాడు రాజకీయాల్లో రిక్కీ రాధన్ పండిట్ పాత్ర   కీలకమైనదిగా భావిస్తారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతికూలంగా వ్యాఖ్యానించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ  విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని రికీ రాధన్  జోస్యం చెప్పారు.

ఆయన చెప్పినట్లే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రిక్కీ రాధన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాధన్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా నియమించారు.

అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నియామకాన్ని ఉపసంహరించుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే విజయ్ రాజకీయ నిర్ణయాల్లో రాధన్ పండిట్ సలహాలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటారు.  ఇటువంటి రాధన్ పండిట్ చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

కవిత తన కుమారుడితో కలిసి రిక్కీ రాధన్ పండిట్‌ను శాలువాతో సత్కరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి.   తెలంగాణ రక్షణ సేన భవిష్యత్తు, రాబోయే రోజుల్లో కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశాలపైనే  కవిత రాధన్ పండిట్ సలహాలు కోరినట్లు తెలుస్తోంది.    తమిళనాడులో విజయ్‌కి తిరుగులేని రాజకీయ విజయం లభిస్తుందని ముందుగానే జోస్యం చెప్పిన  రాధన్ పండిట్ ను కవిత ఆశ్రయించారని అంటున్నారు.  తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కవిత  ఇటీవల  బహిరంగంగానే ప్రశంసలు కురిపించడం, తెలంగాణలో  అమ్మ పాలన  అందిస్తామని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాధన్ పండిట్ తో కవిత భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  

Kalvakuntla Kavitha follows Tamilnadu CM Vijay, Ricky Radhan Pandit, CM Vijay Astrologer, Kavitha Ricky Radhan Meeting, Telangana Rakshana Samithi, Telangana Politics

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.