తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు.. మూడు పార్టీలపై కవిత ఫైర్

Publish Date:Jun 28, 2026

Advertisement

 

ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. 

తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కార్పొరేట్ శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని బలపరుస్తున్నది బీఆర్ఎస్‌లోని కొందరు నాయకులేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉప్పల్‌లో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు.

ఉప్పల్ తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువని పేర్కొన్న కవిత, అలాంటి ప్రాంతంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 250 గజాల స్థలాల కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని, అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని గతంలో అవహేళన చేసినవారే ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

'ఇడుపు కాగితం' అనే పదాన్ని ఎగతాళి చేస్తున్న వారిపై స్పందిస్తూ, దాని అర్థం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్‌ను అడిగితే వివరిస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాషను అవమానిస్తే సహించబోమని స్పష్టం చేశారు. గతంలో అవమానాలను ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. భాషలన్నింటినీ గౌరవించాలని, అయితే తెలంగాణ భాషను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

తెలంగాణ భాషను అవమానిస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని విమర్శించారు. బీజేపీ దేశ ప్రయోజనాల పేరుతో తెలంగాణ సమస్యలను విస్మరిస్తోందని, బీఆర్ఎస్ కూడా స్పందించడం లేదని ఆరోపించారు.

బీఆర్ఎస్‌లోని కొందరు నాయకులు నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నందువల్లే తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడడం లేదని ఆరోపించారు. నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో మదర్ డెయిరీ, ముల్కానూరు, విజయ డెయిరీల పాలనే వినియోగించేలా ప్రభుత్వం జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ విద్యాసంస్థల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, పాఠశాల ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. టీచర్లలో అధిక శాతం కేరళ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారినే నియమిస్తున్నారని, ఉత్తర భారతదేశానికి చెందిన విద్యాసంస్థలు కూడా చిన్న ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.

తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడేది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని కవిత పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నది బీఆర్ఎస్‌లోని నాయకత్వమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని, లాఠీలు, రబ్బరు తూటాలకు కూడా భయపడబోనని స్పష్టం చేశారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప్పల్‌లోని అన్ని డివిజన్లలో పోటీ చేస్తామని, భవిష్యత్తులో ఉప్పల్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

By
en-us Political News

  
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.