Publish Date:Aug 17, 2026
తెలంగాణ రాజకీయాలలో కవిత వ్యాఖ్యలు మరో సారి తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర సొంత పార్టీ ఏర్పాటు చేసిన కవిత.. అప్పటి నుంచీ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. పలు ఇంటర్వ్యూలలో కవిత.. బీఆర్ఎస్ లో తనపై జరిగిన రాజకీయ కుట్రలను, ఎదుర్కొన్న అవమానాలను ఎలంటి శషబిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతూ వస్తున్నారు. తాజాగా మరో సారి ఆమె బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. ఈ సారి ఆమె నేరుగా తన సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కవితను తాము పార్టీ నుంచి పంపించలేదనీ.. ఆమెకు అనేక రాజకీయ అవకాశాలు కల్పించినప్పటికీ సొంత నిర్ణయాలతో దూరమయ్యారని పేర్కొన్న వ్యాఖ్యలకు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం, షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు. ఏ వివరణ కోరకుండానే సస్పెన్షన్ వేటు వేయడం వెనుక సొంత పార్టీలోనే కొందరు కుట్రపన్నారన్నారు. ఈ పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయని, తన కన్నతండ్రి కేసీఆర్‌ను కూడా కలవనీయకుండా కొందరు డ్డుకున్నారని కవిత ఈ సందర్భంగా చెప్పారు.
పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిందని విమర్శించిన కవిత, కేసీఆర్ కుమార్తెగా ఉన్న తనకు పార్టీలో ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సాధారణ కార్యకర్తల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేసి ప్రజల కోసం పోరాట బాట పట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి అడుగుపెట్టే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. అదలా ఉండగా.. కల్వకుంట్ల కవిత విమర్శలు, ఆపోపణలపై బీఆర్ఎస్ అధినాయకత్వం సరైన రీతిలో స్పందించలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, కవిత లేవనెత్తిన సాంకేతిక, వ్యక్తిగత అనుభవాలకు సమాధానం ఇవ్వలేకపోయారు.
Kalvakuntla Kavitha, KCR KTR BRS Dispute, Telangana Rakshana Sena, Telangana Politics, BRS Internal Conflicts
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-25-229060.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?