ఖైరతాబాద్ బరిలో టీఆర్ఎస్: కల్వకుంట్ల కవిత పొలిటికల్ వ్యూహం.. సామాజిక తెలంగాణ నినాదం.!

Publish Date:Sep 28, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ బైపోల్ హాట్ టాపిక్ గా మారంది. అందులోనూ ఈ ఎన్నిక బరిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నిలబడనుండటంపై పోలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఇక నుంచి రాబోయే ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పోటీ చేయాలన్న కవిత నిర్ణయం రాజకీయవర్గాలలో సంచలనంగా మారింది.  

. బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక,  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలోనూ,    గ్రేటర్ హైదరాబాద్ స్థానిక పోరులోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. టీఆర్ఎస్ పోటీ  ఏ పార్టీ ఓట్లకు ఆమె గండి కొట్టబోతున్నారనే చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. 

ఎన్నికలలో పోటీ ప్రకటనతో పాటు కవిత   కొన్ని గ్యారెంటీలు,   ప్రత్యేక హామీలూ కూడా  ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి వస్తే.. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే  4 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామనీ,   అలాగే ప్రైవేట్ స్కూళ్లలో  నాణ్యమైన, ఉచిత విద్యను అందించడం, దీర్ఘకాలిక వ్యాధులతో సహా అన్ని రకాల రోగాలకు పూర్తి ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించడం వంటి హామీలూ, గ్యారెంటీలు ప్రకటించారు.

యువతలో స్వయం ఉపాధి,  నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లకు తగిన నిధులు అందించడంతో పాటు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతులకు ప్రత్యేక సహాయక డెస్క్‌లను ఏర్పాటు చేసి  రైతే రాజు' నినాదాన్ని నిజం చేస్తామని కవిత చెప్పారు.

వెనుకబడిన తరగతులకు, మహిళలకు, యువతకు రాజకీయంగా, సామాజికంగా సమాన అవకాశాలు కల్పించి.. తద్వారా సామాజిక తెలంగాణ సాధిస్తామని కవిత చెప్పారు.  2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందని కవిత వెల్లిండించారు.  మొత్తానికి స్థానిక ఉప ఎన్నికల నుంచి సార్వత్రిక పోరు వరకు కవిత వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచే టీఆర్ఎస్ ను సమాయత్తం చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

[Kalvakuntla Kavitha,  political strategy, Telangana Rakshana Sena,TRS, manifesto, Graduate MLC elections, Khairatabad bypoll, Telangana politics, Telugu One]

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.