సాధిక్.. ద్వారంపూడి అనుచరుడా?
Publish Date:Aug 26, 2026
Advertisement
రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఏ మూలైనా సరే ఏదైనా ఒక ఘోరం జరిగితే, ఒక నేరం జరిగితే.. వాటి మూలాలు ఏపీలోని వైసీపీ పార్టీలో ఉంటాయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నవే. ఇప్పుడు తాజాగా నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాకినాడ జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన కుటుంబ ఆత్మహత్య ఉదంతం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం వెనుక లవ్ జిహాద్, మతమార్పిడి ఒత్తిళ్లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ ఉన్నాయన్న ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. ఈ కుటుంబం ఆత్మహత్యకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ అనే వ్యక్తికి వైసీపీతో సంబంధాలున్నాయన్న సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైసీపీ నాయకుడు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సాధిక్ అనుచరుడన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాధిక్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సాధిక్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. సాధిక్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ హయాంలో సాధిక్ కు రాజకీయ అండదండలు పుష్కలంగా లభించాయని, ఆ అండదండలతోనే సాధిక్ ఇటువంటి అరాచకాలకు ఒడిగట్టాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భాధిత నూకరాజు కుటుంబాన్ని లవ్ జిహాద్ పేరుతో వేధింపులకు గురిచేసి, బలవంతపు మతమార్పిడికి ఒత్తిడి తీసుకురావడంతో ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే నూకరాజు కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు. గతంలో సాధిక్ ప్రారంభించిన ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి కూడా మాజీ ఎమ్మెల్యే హాజరైనట్లు చెబుతున్నారు. దీనిపై కాకినాడ ఎంపీ, జనసేన నాయకుడు తంగెళ్ల శ్రీనివాస్ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్‌ను ఈ ఉదంతం వెనుక ఏకపక్ష వేధింపులే కాకుండా ఒక పెద్ద వ్యవస్థాగత రాకెట్ పనిచేస్తోందని ఎంపీ ఆరోపించారు. అమాయక కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ తరహా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. Kakinada Family Suicide, Sadiq Controversy, Dwarampudi Chandrasekhar Reddy Link , Kakinada Love Jihad Case
http://www.teluguone.com/news/content/kakinada-family-suicide-25-229928.html




