విజయ సాయి పిటిషన్ కు కోర్ట్ అబ్జెక్షన్

Publish Date:Jan 23, 2012

Advertisement

హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి ల్యాప్‌టాప్‌ను వాడుకోవడానికి అనుమతించాలనే విజ్ఞప్తిని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు  తిరస్కరించింది.  తాను జగన్ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలకు ఆర్థిక సలహాదారుగా ఉన్నందున సలహాలు ఇవ్వడానికి తనకు ల్యాప్‌టాప్ ఇవ్వాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే  విజయ సాయి రెడ్డికి ల్యాప్‌టాప్ ఇస్తే సాక్షులను బెదిరించే అవకాశం, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని సిబిఐ కోర్టు ముందు వాదించింది. టైప్ రైటర్‌ను విజయ సాయి రెడ్డి వాడుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో విజయ సాయి రెడ్డికి ల్యాప్‌టాప్ ఇవ్వడం సరి కాదని సిబిఐ వాదించింది.

మరో వైపు ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై కోర్టులో సోమవారం వాదనలు పూర్తయ్యాయి. తన నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ తనకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించాలని పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. కోనేరు ప్రసాద్ వైద్యపరమైన రికార్డులు పాతవని సిబిఐ వాదించింది. కోనేరు ప్రసాద్‌కు హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ లో చికిత్స చేయిస్తే సరిపోతుందని అభిప్రాయపడింది.

By
en-us Political News

  
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.