రైతులకు మద్దతుగా పోలీసు స్టేషన్ వద్ద అవినాష్ రెడ్డి ధర్నా

Publish Date:Nov 8, 2025

Advertisement

 

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం  లింగాల మండలంలో విపరీతంగా, విచ్చల విడిగా రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్  మోటార్ల కేబుల్స్ చోరీకి గురవుతన్నాయని, వెంటనే అరికట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం లింగాల పోలీసు స్టేషన్ ఎదుట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రైతులతో కలిసి బైఠాయించారు. 

లింగాల మండల పరిధిలోని పలు  గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు కేబుల్ వైర్లను దొంగలించడంతో రైతులందరూ ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డినికలసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి  రైతులతో  లింగాల ఎస్.ఐ అనిల్ కుమార్ ను కలసి ఇటీవల రైతుల కేబుల్ వైర్లు దొంగతనాల పై చర్చించారు. అలాగే ఈ దొంగతనాల పై షెల్కే నచికేతన్ విశ్వనాథ్ తో కూడ ఫోన్ లో మాట్లాడారు. వీలైనంత త్వరగా దొంగలను  పట్టుకొని కఠినంగా శిక్షించి రికవరీ చేయించాలని కోరారు. 
    

అనంతరం ఎం.పి  రైతులతో కలసి లింగాల పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గత కొన్ని రోజులుగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతుల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేయడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.  నిన్న రాత్రి ఒక్క రోజే 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ చోరీకి గురయ్యాయన్నారు.  రైతుల కేబుల్స్ దొంగతనాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు.  

కొమ్మనూతల గ్రామానికి చెందిన  పురుషోత్తమరెడ్డి భార్యకు సంబంధించి 1000 మీటర్ల కేసుబ్ చోరీ గురి కావడంతో రూ.2.5 లక్షలు నష్టపోయారన్నారు.  ఈ విషయాన్ని ఎస్.ఐ దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలో రికవరీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులకు జరుగుతున్న  నష్టాన్ని గుర్తించి రికవరీ విషయంలో శ్రద్ధ చూపాలని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.   ప్రస్తుతం అరటి పంట కు టన్ను రూ.4 వేలు, 5 వేలు అడుగు తుండడంతో  రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు.  

దీనికి తోడు దొంగలు ఇష్టానుసారంగా రైతుల కేబుల్ వైర్లను తస్కరించడంతో రైతుల బాధ వర్ణణాతీతమన్నారు. వీలైనంత త్వరగా కేబుల్ వైర్ల దొంగలను పట్టుకుని వైర్లు రికవరీ చేయాలని, అలాగే కేబుల్ వైర్ లోని రాగి వైరు కొన్న వారిని కూడ అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు. 

కేబుల్ వైర్లు పోయిన రైతులకు నష్టపరిహారం కూడ అందేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.సాగుచేసిన పంటలకుగిట్టు బాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతుంటే నేడు మోటార్ కేబుల్స్ చోరీకి పాల్పడు తుండండతో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారన్నారు.  తప్పుడు పనులు చేసే వారు మానుకోవాలని, రైతుల పొట్ట కొట్ట వద్దని ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి కోరారు.

By
en-us Political News

  
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.