కాదంబరి జిత్వానీ కేసు దర్యాప్తు అధ్వానం.. ఏబీవీ సంచలన వ్యాఖ్యలు.!

Publish Date:Aug 4, 2026

Advertisement

ముంబైకి చెందిన సినీ నటి, మోడల్  కాదంబరి జెత్వాని వేధింపుల ఉదంతంపై   ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్,  రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  బహుశా..ఏపీ పోలీసు హిస్టరీలో, ఏపీ ఏమిటి ఇండియాలోనే ఈ తరహా కేసు గతంలో ఎన్నడూ జరిగి ఉండదన్న ఏబీ వెంకటేశ్వరరావు..  కాదంబరి జత్వానీ కేసు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాల్సిన కేసు అని వ్యంగ్యంగా అన్నారు. కంచే చేను మేసిన చందంగా కాదంబరి జత్వానీ కేసులో  కొందరు  పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉండటం శోచనీయమన్న ఏబీవీ.. చట్టాన్ని రక్షించాల్సిన  అధికారులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు.  బాధితురాలికి న్యాయం జరగడమే కాకుండా, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అమాయకులను ఇబ్బందులకు గురిచేసే సంస్కృతి వ్యవస్థకు   మంచిది కాదన్నారు. 

అసలు కాదంబరి జత్వానీ కేసులో తొలి నుంచీ నిబంధనలను పట్టించుకోకుండానే వ్యవహరించారన్న ఏబీవీ.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేసు నీరుగారేలాగే దర్యాప్తు సాగిందని విమర్శించారు.  వాస్తవానికి జిత్వానీని పోలీసు కస్టడీలోకి తీసుకున్న సమయంలోనే ముంబై గొడవలో ఆమె పెట్టిన కేసు వెనక్కు తీసుకోవాలన్న బెదరించారని ఆమే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  జిందాల్ కేసు వ్యవహారంలో దర్యాప్తు పూర్తిగా చేయలేదన్న ఆయన సీఐడీ అంత అధ్వానంగా వ్యవహరించిందని విమర్శించారు.  ఒక హెడ్ కానిస్టేబేల్ కూడా ఇంత దారుణంగా దర్యాప్తు చేయరన్నారు. 

ప్రజల డబ్బు తో జీతాలు తీసుకునే పోలీసులు అధికారం, దన బలం ఉన్న వారి కోసమే పని చేస్తున్నారు. జిత్వానీ  కేసులో ఇద్దరినే సాక్షులు గా పెట్టారనీ, వారిద్దరి స్టేట్ మెంట్లూ మక్కీకి మక్కీ ఒకేలా ఉండటమే దర్యాప్తు ఎంత దౌర్భాగ్యంగా సాగిందో చెప్పడానికి ఉదాహరణ అన్నారు. ఈ కేసులో సీఐడీ తీరు దారుణమన్నారు. ఎవరి ప్రయోజనాలనో కాపడాడానికే సీఐడీ దర్యాప్తు సాగిందన్నారు.  

దురదృష్ట వశాత్తూ గతంలో నూ ఇప్పుడూ కూడా కాదంబరి జత్వానీ కేసు విషయంలో బాధితురాలికి న్యాయం జరిగేలా దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు.   రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయడం ఐపీఎస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే అంశమని ఘాటుగా విమర్శించారు. బాధితురాలు ఎదుర్కొన్న మానసిక, శారీరక వేధింపులకు కారణమైన వారిని విడిచిపెట్టకూడదని అభిప్రాయపడ్డారు.

పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించినప్పుడే సమాజంలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని ఏబీవీ పేర్కొన్నారు. ఏదైనా కేసు నమోదు చేసే ముందు నిబంధనల ప్రకారం వ్యవహరించాలా లేదా అనే ప్రాథమిక సూత్రాలను కూడా పక్కనపెట్టి అధికారులు ప్రవర్తించడం దారుణమన్నారు.    

Kadambari Jethwani case investigation in shambles, ABV, Sensational, Cpmments

By
en-us Political News

  
ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను మూసివేయడానికి లేదా పూర్తిగా ఉపసంహరించుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.
జగన్ దర్శనం దక్కకుండా సజ్జల అడ్డుకుంటున్నారు..!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యల వ్యవహారంలో ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్ ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.
చండీపురా వైరస్ తో 25 మంది చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్ పై ఉన్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నూజివీడు పోలీసులు, గుజరాత్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.
ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది. 
యాపిల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్‌లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.