Publish Date:Oct 15, 2022
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ రంగంలోకి దిగుతారని ప్రచారమైనా చివరి నిముషంలో ఆయన గాయబ్ కావడంతో రంగంలోకి స్వయంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దిగారు. ఇక నామినేషన్ లకు గుడువు ముగుస్తుందనగా చివరి నిముషంలో కేఏ పాల్ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.
వాస్తవానికి ఈ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ ను నిలబెడుతున్నట్లు పాల్ స్వయంగా కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఏం జరిగిందో కానీ.. చివరి నిముషంలో పాల్ స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే తానే స్వయంగా నిమినేషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందో పాల్ వివరించారు.
నామినేషన్ వేయకుండా గద్దర్ ను పోలీసులు అడ్డుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తానే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. డబ్బు ఆశ చూపుతూ జనాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో ఓటుకు రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ka-paul-files-nominatio-as-prajashanti-candidate-in-munugodu-25-145459.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.