కేఏ పాల్..నవ్యులు పూయించే పొలిటికల్ కమేడియన్!

Publish Date:Jul 29, 2022

Advertisement

సినిమాలో బ్రహ్మానందం కనిపించగానే ఆయన డైలాగులతో, నటనతో సంబంధం లేకుండా ప్రేక్షకుడి మొహం ఆనందంతో విప్పారిపోతుంది. అతడి ప్రమేయం లేకుండానే పెదవులు విచ్చుకుని నవ్వు వచ్చేస్తుంది. కమేడియన్ గా బ్రహ్మానందం ప్రక్షకుల్లో సంపాదించుకున్న క్రేజ్ అది. సరిగ్గా అలాంటి క్రేజే రాజకీయాలలో మరో కమేడియన్ కు వచ్చేసింది. బ్రహ్మానందం అంటే ప్రేక్షకుడికి అభిమానం, ప్రేమ, గౌరవం అన్నీ ఉంటాయి. కానీ ఈ రాజకీయ కమేడియన్ మాత్రం కేవలం ప్రగల్భాల లాంటి మాటలతో కితకితలు పెట్టి బలవంతంగా నవ్విస్తాడు.

ఆ రాజకీయ కమేడియన్ పేరు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధినేత. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆయనను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, దేశ ప్రధాని ఇలా అన్ని పదవులకూ తనను మించిన అర్హుడు లేడని తొడగొట్టి మరీ చెబుతారు. పనిలో పనిగా మోడీ నుంచి ఆయన నోటికి తెలిసిన నాయకులందరూ తనను త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా ఆశ్రయించారనీ.. కానీ రాజీ పడటం ఇష్టం లేకనే తాను ఎవరితో కలవకుండా ఒంటరిగానే దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసేందుకు రంగంలోకి దిగానని చెప్పుకుంటారు.

రాజ్యం, సైన్యం లేని మహారాజును తానేనని అంటారు. ఆయన తాజాగా ఏపీ ముఖ్యమంత్రి, విపక్ష నేతలపై కొన్ని విమర్శలు చేశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో తెగ ట్రోల్ అవుతున్నాయి. పాల్ గారికి అటువంటి ట్రోలింగ్ పై పెద్ద పట్టింపు లేదను కోండి అది వేరే సంగతి. కానీ ప్రజలకు ఆయన ప్రసంగాలు, సామాజిక మాధ్యమంలో ఆయనపై వచ్చే సెటైర్లు మంచి వినోదాన్ని పంచుతాయనడంలో సందేహం లేదు.

తాజాగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనను బుజ్జగించేందుకు చాలా ప్రయత్నం చేశారని అన్నారు. తనను కలవాల్సిందిగా చంద్రబాబు కబురు పెట్టారని చెప్పుకున్నారు.  అయితే సీక్రెట్ మీటింగ్ లు ఎందుకు ఏం మాట్లాడుకున్నా జనం ముందే మాట్లాడుకుందామని ఆయనకు తాను చెప్పాననీ, ఆయన కబురు పెట్టినా తాను వెళ్ల లేదనీ పాల్ చెప్పుకున్నారు. ఇక అదే నోటితో జగన్ గురించి కూడా వాకృచ్చారు. చంద్రబాబుతో రహస్య మీటింగ్ వద్దనుకున్నానన్న పాల్ గారు. జగన్ తో మాత్రం అటువంటి సమావేశానికి తహతహలాడిపోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాను కలవాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా జగన్ అందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.

జగన్ కు తనను ఫేస్ చేసే ధైర్యం లేదనీ, ఆయనో పిరికిపంద అనీ అందుకే తనను కలవడం లేదనీ, తనతో భేటీకి రావడం లేదని చెప్పుకుంటున్నారు. సరే ఆయనేం చెప్పుకున్నా అందరికీ వినోదమే కానీ.. ఒకరితో రహస్య మీటింగ్ వద్దన్నాననీ, అదే సమయంలో మరొకరితో రహస్య మీటింగ్ కు అవకాశం రావడం లేదనీ ఆయన తెగ ఫీలైపోతున్నారు ఎందుకనో. అసలు విషయమేమిటంటే ఆయన పాస్ పోర్టు సీజ్ అయ్యింది. ఇప్పుడు ఆయనకు తక్షణ అవసరం ఆయన పాస్ పోర్టు ఆయనకు రావడం ఈ విషయాన్ని కూడా పాల్ స్వయంగా చెప్పారు. అందుకోసమే జగన్ తో రహస్య మీటింగ్ కు తహతహ. ఆయనకు నచ్చుతుందనే చంద్రబాబు పిలుపును తాను లెక్క చేయలేదని చెప్పుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.  

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.