Publish Date:Aug 30, 2024
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ న్యాయ పోరాటానికి దిగారు. తెలుగునాట రాజకీయాల్లో ఫిరాయింపులు కొత్తేం కాదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో వలసలను ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ప్రోత్సహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రోత్సహించి బిఆర్ఎస్ లో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అదే ఫార్ములాను కాంగ్రెస్ కొనసాగించింది. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పరాజయం చెందిన తర్వాత కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఈ వలసలు లేదా ఫిరాయింపులు నేటి వరకు ఆగడం లేదు. కెఏ పాల్ కు ఇది రుచించలేదు. కోర్టు తలుపు తట్టి న్యాయం కావాలని అర్థిస్తున్నారు.
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం అన్యాయమని కెఏ పాల్ భావన. హైకోర్టులో వేసిన పిటిషన్ లో కూడా దానం నాగేందర్ ప్రస్తావన తెచ్చారు. బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం తగదన్నారు. ఆరు నెలలు తిరగకముందే కాంగ్రెస్ లో జంప్ కావడం అనైతికమని పాల్ వాదిస్తున్నారు. అధికారమే పరమావధిగా పార్టీలు మారుతున్నవారికి సంకెళ్లు వేయడానికి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని పాల్ అభ్యర్థించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ka-paul-25-183927.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు