కేసీఆర్ ను వదిలేదే లే..పాల్

Publish Date:Jun 22, 2022

Advertisement

కేఏ పాల్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటారు. ఆయన మాటను ఎవరూ కాదనరు. ఎందుకంటే అసలుపట్టించుకోనే  కోరు కనుక. వరుస పెట్టి అందర్నీ ఆయన కలిసేస్తూ ఉంటారు. అమిత్ షా అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా ఇలా ఎవరైనా సరే ఆయన కలుస్తానంటే వద్దని అనరు ఎందుకొచ్చిన గొడవ ఆయన చెప్పేదేదో చెప్పనిచ్చి పంపిస్తే పోలా  అనుకుంటారు.  

ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి భరతం పడతానంటున్నారు. ఇందు కోసం ఆయన సీబీఐకి కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతిపై ఫిర్యాదు చేశారు. వాళ్లకీ, వీళ్లకీ కాదు.. ఏకంగా సీబీఐ డెరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ కు. ఇందుకోసం ఆయన స్వయంగా ఢిల్లీలో సుభోద్ కుమార్ జైశ్వాల్ అప్పాయింట్ మెంట్ తీసుకుని (పాల్ కోరితే అప్పాయింట్ మెంట్ ఇవ్వని వారెవరుంటారు..) అది వేరే సంగతి) మరీ కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబం ఏకంగా 9లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనీ, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి, ఇంతటి అవినీతిని తాను చూడలేదనీ ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎందుకంటే కేఏ పాల్ ప్రపంచం చుట్టి వచ్చిన వీరుడు కదా. ఎక్కడా కనని, వినని అవినీతి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాల్పడిందని, వెంటనే విచారణ జరిపించాలనీ ఆయన ఫిర్యాదు సారాంశం. ఇది తన ఒక్కడి మాటే కాదనీ యావత్ తెలంగాణ ప్రజా కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిన అవినీతిపై విచారణ జరగాలని కోరుకుంటోందని సెలవిచ్చారాయన.

చర్విత చరణమే అయినా ఆయన బీజేపీ చేసిన, చేస్తున్న ఆరోపణలనే సీబీఐకు ఫిర్యాదు రూపంలో ఇచ్చారు. రాష్ట్ర విభజనతో 60వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేసీఆర్ కుటుంబ అవినీతికి ఆకాసమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోయిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ సహా సింగపూర్ దుబాయ్, అమెరికాలలో కూడా ఆ కుటుంబం ఆస్తులు కూడబెట్టిందని పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5వేల కోట్ల రూపాయలైతే కేవలం 35 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేశారని, ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 75 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

యాదాద్రి విషయంలోనూ అంతులేని అవినీతికి పాల్పడ్డారని సమగ్ర విచారణ జరిపితే అన్నీ బయటకు వస్తాయనీ పాల్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మాటలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశారు కనుక ఆ సంస్థ దర్యాప్తు ప్రారంభిస్తుందా.. లేక ఓ కమేడియన్ పొలిటీషియన్ ఫిర్యాదు చేశారని నవ్వుకుని వదిలేస్తుందా అన్నది చూడాలి. సీబీఐ ఏ దర్యాప్తునూ తనంత తానుగా చేపట్టదు కనుక పాల్ ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు కదులుతుందని భావించలేం. వార్తల్లో నిలవడానికి ఇదో మార్గంగా ఎంచుకుని పాల్ సీబీఐ డైరెక్టర్ ను కలిసి హడావుడి చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తునకు తాను పూర్తి సహకారం అందిస్తాననీ పాల్ సీబీఐ డైరెక్టర్ కు హామీ ఇచ్చారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తెలంగాణలో తనపై దాడులు జరుగుతున్నాయని పాల్ సీబీఐ డైరెక్టర్ కు విన్నవించారు. తన ఫిర్యాదు కాపీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సైతం పంపారు.

 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.