సాదా సీదాగా జూపల్లి కాంగ్రెస్ రీ ఎంట్రీ !

Publish Date:Aug 3, 2023

Advertisement

మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు  ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి మరి కొందరు జూపల్లి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆరేడు నెలలుగా సాగుతున్న జూపల్లి, పొంగులేటి రాజకీయ ప్రహసనానికి తెర పడింది. నిజానికి, జూపల్లి పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యారు.మంత్రి కూడా అయ్యారు. సో ... జూపల్లి కాంగ్రెస్ లో చేరడం ఒక విధంగా స్వగృహ ప్రవేశమే అని చెప్పాలి. 

అయితే అదేమిటో కానీ జూపల్లి స్వగృహ ప్రవేశం ఆయన అనుకున్నట్లుగా   జరగలేదు. జూపల్లితో పాటుగా బీఆర్ఎస్ బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కోరుకున్న  విధంగా, కోరుకున్న ముహూర్తానికి కాంగ్రెస్  కండువా  కప్పుకున్నారు. జూలై 2 న, ఖమ్మం జిల్లాలో సొంత గడ్డపై, లక్షల మంది ప్రజలు పాల్గొన్న బ్రహ్మాండమైన జనగర్జన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతే కాదు  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభతో జన గర్జన  సభ తోడవడంతో పొంగులేటి ఎంట్రీకి మీడియాలో  మంచి మైలేజి వచ్చింది. మీడియా చర్చల్లో ప్రముఖంగా నిలచింది   

నిజానికి అదే సభలో జూపల్లి కుడా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా  జూపల్లి, పొంగులేటి సభను తలదన్నేవిధంగా కొల్లాపూర్ లో భారీ బహిరంగ  సభ నిర్వహించి రాహుల్ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవాలని భావించారు. అయితే కారణాలు ఏవైనా కొల్లాపూర్ సభ రెండు మార్లు వాయిదా పడింది. 

ఈ నేపధ్యంలోనే జూపల్లి కృష్ణా రావు ఢిల్లీ వెళ్లి చేరిక క్రతువును కానిచ్చుకున్నారు. అయితే అదేమిటో కానీ వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా  ఢిల్లీ వెళ్ళినా జుపల్లికి నిరీక్షణ తప్పలేదు.అనుకున్న విధంగా చేరిక క్రతువు జరగ లేదు. కనీసం, ఢిల్లీలో అయినా రాహుల్ లేదా ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని జూపల్లి ఆశించారు. అయితే, చివరకు ఆ కోరిక తీరలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంక్షలో జూపల్లి, అయన అనుచరులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. మళ్ళీ అక్కడ కూడా జూపల్లికి ముహూర్తం కలిసి రాలేదు. నిజానికి   బుధవారమే (ఆగస్టు 2)  జూపల్లి,కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి తదితరుల పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే బుధవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేరడానికి వారు ఢిల్లీ చేరుకున్నారు.

అయితే  తర్వాత కర్ణాటక కాంగ్రెస్‌ నేతలతో సమావేశాలతో ఖర్గే బిజీబిజీగా గడిపారు. దాంతో జూపల్లి చేరిక గురువారానికి వాయిదా వేశామని మల్లు రవి వెల్లడించారు. చివరకు, ఈరోజు, ఖర్గే, సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, , ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. అంజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.