లోకేష్ పాదయాత్రకు సంఘీభావం.. కుప్పంకు జూనియర్ ఎన్టీఆర్?

Publish Date:Jan 25, 2023

Advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. యువగళం పేరిట చేపట్టనున్న పాదయాత్ర కుప్పం నుంచి శుక్రవారం (జనవరి 27) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ కార్యక్రమంలో అటు నారా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీలు హాజరవుతున్నాయని తెలుస్తోంది.  మరోవైపు టీడీపీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం తరలిరానున్నాయి.  అయితే ఈ పాదయాత్ర ప్రారంభంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ సైతం హాజరు కానుందని  తెలుగుదేశం శ్రేణులుఅంటున్నాయి.  అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి  హీరోలు నందమూరి కల్యాణ్ రామ్, తారకరత్న,  అలాగే చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్‌  ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం.  

ఇక జూనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లో నటిస్తూ.. బీజి బీజిగా ఉన్నా  వైపు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విషయంలోనే కాదు.. టీడీపీపై జగన్ అండ్ కో వ్యవహారిస్తున్న తీరుపై తనదైన శైలిలో ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు.  ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరును జగన్ ప్రభుత్వం మారిస్తే.. ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.  అలాగే ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు.. గోల్డెన్ గ్లోబల్ పురస్కారం దక్కించుకున్న సందర్భంలో ఆ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణిలతో పాటు చిత్ర యూనిట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ శుభాకాంక్షల సందేశంలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకున్నా  జూనియర్ ఎన్టీఆర్...   థ్యాంక్స్ మామయ్య అంటూ రీట్విట్ట్ చేశారు.  గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు ఫ్యామిలీలో ఒకింత దూరం పాటిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఎన్టీఆర్ ధ్యాంక్యూ మావయ్యా అన్న స్పందన ఆ ప్రచారానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లైంది.

అలాగే పార్టీలో  1995 ఆగస్టు సంక్షోభం విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అపోహలను, అనుమానాలను ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్  షో నివృత్తి చేసేసింది. నాడు మొత్తం తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ కుటుంబం కలిసి తీసుకున్న నిర్ణయమని ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ విస్పష్టంగా ప్రకటించి అన్నిఅనుమానాలకూ తెరదించేశారు. దీంతో  మరోవైపు.. నందమూరి, నారా కుటుంబాలు మొత్తం కలిసి ఉన్నాయని .. వీరి మధ్య ఎలాంటి ఆపోహాలు, అగాధాలు లేవని బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్   చంద్రబాబు అభినందనలకు ధ్యాంక్యూ మావయ్యా అంటూ వరుస పెట్టి మరీ సంభోదిస్తూ రిప్లై ఇచ్చారని అంటున్నారు. అలాగే అదే నాటునాటుపాట ఆస్కార్ కు నామినేషన్ లభించిన సందర్భాన్ని పురస్కరించుకుని మళ్లీ చంద్రబాబు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరును ట్వీట్ చేయడమే కాకుండా ఆయనకు ట్యాగ్ కూడా చేశారు. ఈ పరిణామాలతో  జూనియర్ ఎన్టీఆర్ తో దూరం అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో  మరోవైపు నారా లోకేశ్ చేపట్టనున్న పాదయాత్రను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఆ క్రమంలో ఈ పాదయాత్రను సూపర్ సక్సెస్ చేసే విధంగా పావులు కదుపుతోంది. ఇంకోవైపు ఈ పాదయాత్రకు కండిషన్లుతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు.

అయితే నారా లోకేశ్ పాదయాత్రకు కండిషన్‌తో కూడిన అనుమతులపై టీడీపీ శ్రేణులే కాదు.. పసుపు పార్టీ అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభ కార్యక్రమానికి జూనియర్ హాజరు కానున్నారన్న వార్త తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందోత్సాహాలను నింపుతోంది. 
 

By
en-us Political News

  
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.