తెలుగుదేశం విజయం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు!
Publish Date:Jun 10, 2024
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం అఘండ విజయం తరువాత కూడా రాజకీయ వర్గాల్లో ఎన్టీఆర్ పేరు విస్తృతంగా చర్చకు వస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరౌతారా లేదా అన్న చర్చ పొలిటికల్, సినీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అదలా ఉంచితే జూనియర్ ఎన్టీఆర్ కి పాలిటిక్స్ పై మంచి అవగాహన ఉందనీ, ప్రస్తుత రాజకీయాలను ఆయనెంతో శ్రద్ధగా గమనిస్తుంటారనీ ఆయన సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. అంతే కాదు ఓ ఏడాది ముందే ఆయన ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా అంచనా వేశారని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. తమిళనాడులో డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని జూనియర్ ఎప్పుడో చెప్పారట. ఆయన అంచనా వేసినట్టుగానే తెలంగాణలో హస్తం పార్టీ జెండా ఎగరేసింది. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం విజయబావుటా ఎగురవేయడం ఖాయమని ఆయన అప్పుడే చెప్పారట. ఇప్పుడు ఆ విషయాన్నే ఎన్టీఆర్ సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. జూనియర్ కొంతకాలంగా తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నాడు. తెలుగుదేశం శ్రేణులు సైతం కొన్ని విషయాల్లో తారక్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది ఏపీలో తెలుగుదేశం పార్టీదే అధికారమని ఎన్టీఆర్ తన సన్నిహితులతో చాలా కాలం కిందటే చెప్పడం, దానిని ఆయన సన్నిహితులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయడం చూస్తుంటే.. జూనియర్ మళ్ళీ తెలుగుదేశానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/junior-ntr-predicted-tdp-win-long-back-39-178298.html





