వైసీపీ నుంచి వలసల వరద.. గట్లు తెగిపోవడం ఖాయం!

Publish Date:Sep 11, 2024

Advertisement

వైసీపీ ఖాళీ అయిపోతుందా? ఆ పార్టీ నుంచి వలసలను ఆపడం జగన్ వల్ల కావడం లేదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వైసీపీ అధికారం ఉన్నంత కాలం పెత్తనం చెలాయించిన నేతలు సైలెంట్ అయిపోయారు. ఒకరిద్దరు ఇప్పటికీ తెలుగుదేశం కూటమి సర్కార్ పై నోరు పారేసుకుంటున్నా.. వారిని జనం పట్టించుకోవడం లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు పలువురు రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉంటున్నారు. మారదామన్నా వారికి చోటిచ్చే పార్టీ లేకపోవడంతో ప్రస్తుతానికి మౌనమే మేలని మిన్నకుంటున్నారు. ఇక పలువురు ఇప్పటికే పార్టీని వీడి అవకాశమున్న పార్టీల్లో సర్దుకున్నారు. పదవులు, హోదా గురించి మాట్లాడకుండా చోటిస్తే చాలన్నట్లుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ గూటికి చేరడానికి రెడీ అయిపోతున్నవారు మరి కొందరు ఉన్నారు. 

రాజ్యసభలో బలం ఉందంటూ భుజాలెగరేస్తున్న జగన్ కు అక్కడా గండి పడింది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులు రాజీనామా చేయగా, ఇంకా పలువురు అదే బాటలో ఉన్నారనీ, ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో టచ్ లోకి వెళ్లారనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే  శాసనమండలిలో కూడా వైసీపీకి ఉన్నది బలం కాదు వాపు అని తేలిపోయింది. జగన్ ను ధిక్కరించేందుకు పలువురు ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టి ఇద్దరు ఎమ్మెల్సీలు మండలికి హాజరయ్యరని, ముందు ముందు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా జగన్ కు ఝలక్ ఇవ్వడం ఖాయమన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది. 

ఇక తాజాగా జగన్ పార్టీకి దూరం అవుతున్న వారి జాబితాలో జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమే అనడానికి గత కొద్ది కాలంగా సామినేని ఉదయభాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటమే తార్కాణమంటున్నారు పరిశీలకులు.     

అయితే ఉదయభానుకు వైసీపీ అధికారంలో ఉండగా జనసేనకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచారం ఇప్పుడు అవరోధంగా మారుతోంది. జనసేన శ్రేణులు ఉదయభానును పార్టీలో చేర్చుకోవద్దంటూ పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారంటున్నారు.  గతంలో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో జనసేన ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను ఉదయభాను ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ధ్వసం విషయాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.  నాడు దిమ్మె ధ్వంసంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించిన ఉదయభానును పార్టీలో ఎలా చేర్చుకుంటారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.   వీటన్నిటికీ తోడు జనసేనలో చేరడానికి ఉదయభాను కొన్ని కండీషన్లు పెట్టారనీ, వాటిలో ప్రధానంగా  తనకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షపదవి ఇవ్వాలనీ కోరుతున్నారని అంటున్నారు. దీనిని కూడా జనసైనికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.  మొత్తం మీద సామినేని ఉదయభానుకు జనసేనలో ఎంట్రీ వచ్చినా రాకున్నా ఆయన మాత్రం వైసీపీని వీడడం ఖాయమైందని పరిశీలకులు చెబుతున్నారు.   

By
en-us Political News

  
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.