కిమ్స్ ఆస్పత్రి నుంచి జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్..!
Publish Date:Aug 13, 2026
Advertisement
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..! ప్రముఖ సినీ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. వైద్యులు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతం గా పూర్తయిందని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌ను ఆస్పత్రిలోనే ఉంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారక్ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, శస్త్రచికిత్స విజయవంతం గా పూర్తయిందని బులెటిన్‌లో పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తు న్నారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో అభిమానుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తన శస్త్రచికిత్సపై స్వయంగా తారక్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఎన్టీఆర్. ‘మీ అందరి నుంచి వెల్లువెత్తిన ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు. నా కోసం మీరు ప్రార్థనలు చేసినందుకు చాలా కృతజ్ఞుడిని. సర్జరీ విజయవంతమైంది. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. స్నేహితులు, కుటుంబం, అభిమానులు మద్దతు నాకు ప్రతిరోజు బలాన్ని ఇస్తుంది. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. Jr NTR discharged from KIMS Hospital, Jr NTR, KIMS Hospital, Secunderabad, Health Bulletin
http://www.teluguone.com/news/content/jr-ntr-discharged-from-kims-hospital-36-228881.html





