షర్మిల ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ కు ఊపు!

Publish Date:Dec 13, 2023

Advertisement

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గాలి వీచింది. దీంతో తెలంగాణలో పోలిటికల్ ఈక్వేషన్స్ ఆటోమెటిక్‌గా మారిపోయాయి. ఆ క్రమంలో ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. అయితే ఆ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సైతం అధికారాన్ని హస్తగతం చేసుకొనేందుకు  కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోందా? అందుకోసం సదరు పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు.. ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నదా?,  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకొంటున్న వరుస పరిణామాలను ఆ పార్టీ అధిష్టానం నిశితంగా గమనిస్తోందా? అంటే రాజకీయ విశ్లేషకులు ఔననే చెబుతున్నారు.

దక్షిణాదిలో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కొల్లగొట్టిన హస్తం పార్టీ.. ముచ్చటగా మూడో రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్‌లో సైతం అధికారాన్ని హస్తగతం చేసుకుని అటు బీజేపీకి.. ఇటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీకీ  గట్టి ఝలక్ ఇచ్చేందుకు కార్యచరణను సిద్దం చేస్తోందని చెబుతున్నారు.  అందుకే  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత సోదరి   షర్మిలను.. రంగంలోకి దింపాలని హస్తం పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నదపి అంటున్నారు. 


రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు  షర్మిలకు అప్పగిస్తే.. పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా భావిస్తోందంటున్నారు.  అదీకాక రాష్ట్రంలో అధికార  వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందేనని... అందుకు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికీ సైతం రాజీనామా చేయడమే ఉదాహరణ అంటున్నారు. ఇక ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే జగన్ పై తీవ్ర అసంతృప్తితో   కుతకుతలాడిపోతున్నారన్న సంగతి తెలిసిందే.  అలా జగన్ పై అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న వారు అనంతపురం జిల్లా నుంచి   శ్రీకాకుళం జిల్లా వరకు  ఉన్నారనీ,  వారంతా సమయం, సందర్భం కోసం వేచి చూస్తున్నారని... అలాంటి వేళ.. అసమ్మతి వాదులను   అనునయించి, బుజ్జగించి, పార్టీలోకి తీసుకు రావడం.. అలాగే కర్ణాటక, తెలంగాణలలో ఎన్నికల వేళ ప్రకటించిన తాయిలాలతోపాటు విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని.... అదీ కూడా అయిదు, పది కాదు.. ఏకంగా 20 ఏళ్లు ఇస్తామని  ప్రకటిస్తే.. హస్తం పార్టీ చేతికి పక్కాగా అధికార అందలం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.  

మరోవైపు దివంగత ముఖ్యమంత్రి,   వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆయన కుమారుడిగా ప్రచారం చేసుకొని.. గత ఎన్నికల్లో గద్దెనెక్కిన వైయస్ జగన్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని.. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. అలాగే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం... ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఇప్పటికే అందరికి పక్కా క్లారిటీగా అర్థమైందని..  అలాంటి సమయంలో.. కొద్దిగా ఒప్పిక.. మరికొ ద్దిగా సమయస్పూర్తితో  వ్యవహరిస్తే  రాష్ట్రంలో హస్తం పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందంటున్నారు.  


అదీకాక.. రాజశేఖరరెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలన్నీ వైయస్ షర్మిల పుణికి పుచ్చుకున్నారని... అందుకు ఆమె తెలంగాణలో చేసిన రాజకీయమే నిదర్శనమని.. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. తెలంగాణలో రాజకీయంగా వైయస్ షర్మిల.. సక్సెస్ కాకపోవచ్చు.. కానీ నిరుద్యోగులు, రైతుల కోసం ఆందోళనలు, పాదయాత్ర, ఇక  కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి... ఆమె నేరుగా కారు నడుపు కొంటూ వెళ్లే ప్రయత్నం చేయడం.. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు.. అలాగే ఆ సందర్భంగా  షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పోన్ చేసి.. ఆరా తీయడం.. వగైరా వగైరా.. వైయస్ షర్మిలలో దాగి ఉన్న పోరాట పటిమను బహిర్గతం చేశాయని.. అలాగే గతంలో.. జగనన్న వదిలిన బాణమంటూ ఇదే వైయస్ షర్మిల పాదయాత్ర  సైతం చేసి.. ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లిందని.. అలాంటి చురుకైన వాళ్లే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయల్లో చక్రం తిప్పుతారనే ఓ అభిప్రాయం  సైతం హస్తం పార్టీ అధిష్టానం నుంచి వ్యక్తమవుతున్నదని అంటున్నారు.

అదీకాక తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండనే ఉన్నారు.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న విభజన సమస్యలు ఒక కొలిక్కి తీసుకు వస్తామంటూ ప్రజల్లో ఒక చిన్నపాటి భరోసా  కల్పిస్తే.. జనం నమ్మి ఆదరిస్తారనీ పార్టీ హై కమాండ్ నమ్ముతోంది.


హస్తం పార్టీ అధికారంలోకి వస్తే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని.. ఈ ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు హోరెత్తుతాయని.. దీంతో రాష్ట్రంలోని యువత.. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లనవసరం లేదని.. అలాగే ఇతర రాష్ట్రాల ప్రజలు, పరిశ్రమలు సైతం ఆంధ్రప్రదేశ్‌ వైపు దృష్టి సారిస్తాయని ఓ చిక్కనైన భరోసా ప్రజల్లో కల్పిస్తే మాత్రం.. పక్కాగా వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ హల్‌చల్ చేయడం ఖాయమని  వారు అభిప్రాయపడుతున్నారు. 


అంతే కాదు  షర్మిల వల్ల.. కేంద్రంలోని కమలనాధులకే కాదు.. రాష్ట్రంలోని ఫ్యాన్ పార్టీ నేతలకు సైతం దెబ్బ తప్పదని.. అది ఎలాగంటే.. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆ రెండు పార్టీలు.. ఆంధ్రప్రదేశ్‌లో నేలరాలుతాయని.. తద్వారా..  షర్మిల కన్న కలలు సాకరమవుతాయని.. రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.