Publish Date:May 15, 2026
ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ (జేజీఎఫ్).. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌లో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేసి బంగారం ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్‌ను చిరునామాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్.. దేశంలో గోల్డ్ మైన్స్ అంటే గుర్తొచ్చే పేరు. ప్రైవేటు రంగంలో స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటుచేసిన కేజీఎఫ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. 2000 తర్వాత కేజీఎ్‌ఫలో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇప్పుడు ఆ స్థానంలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. దేశంలోనే రెండో అతి పెద్ద గోల్డ్ మైన్స్‌గా ‘జొన్నగిరి’ నిలవనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నొలకొల్పిన తొలి ప్రైవేట్ మైన్స్ ఇదే. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి వద్ద దాదాపు రూ.400 కోట్లు పెట్టుబడి...వెయ్యి కిలోల బంగారం ఉత్పత్తి సామర్థ్యంతో జొన్న గిరి బంగారు శుద్ధి పరిశ్రమ సిద్ధమైంది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం జొన్నగిరిలో ఉంది ఈ ప్రైవేట్ బంగారు గని. వాస్తవానికి మే నెలలోనే దీనిని ప్రారంభిస్తారని భావించినా, కాస్త ఆలస్యమైంది. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల్లో సుమారుగా.. 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ భారీగా పెట్టుబడి పెడుతోంది.
ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల ద్వారా గుర్తించారు. మన దేశం ప్రతి సంవత్సరం సుమారు 700 నుండి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. జొన్నగిరి గోల్డ్ మైన్ వంటి ప్రైవేట్ గనులు అందుబాటులోకి వచ్చి.. బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే , దిగుమతుల భారం తగ్గుతుంది. అలాగే గోల్డ్ మైనింగ్ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే వీలుంది. తాజాగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో ఎడ్వాన్స్‌డ్ మీడియయం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మట్లాడుతూ.. చంద్రబాబు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రస్తావన తేవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కర్నూలు జిల్లాలో బంగారాన్ని ఉత్పత్తి చేసే గని సిద్ధమైందన్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బంగారంలో దాదాపు 50 నుంచి 60 శాతం వాటా మన రాష్ట్రానిదే కాబోతోందన్నారు. వచ్చే నెలలోనే దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. బంగారం దిగుమతులు విదేశీ మారకపు నిల్వలపై ప్రభావం చూపుతాయన్న చంద్రబాబు.. మన దగ్గరే బంగారం ఉత్పత్తి చేస్తే సమస్యలు ఉండవన్నారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో జొన్నగిరి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jonnagiri-gold-mine-36-219881.html
అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్‌ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది.
తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం.
ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది
నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు.
శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన గ్యాస్ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుండి 4 కి తగ్గిస్తూ కోత విధించింది. అసలు కారణం, సామాన్యులపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి, ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు.
కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సుమారు 20,000 మంది అభ్యర్థుల హైరింగ్ పరీక్షలను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో జరిగిన అక్రమాలే దీనికి కారణమా? ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక సడలింపులు ఇచ్చింది. బడ్జెట్ 2026 పరిమితుల కంటే మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐదేళ్లలో 690% మరియు పదేళ్లలో 1040% భారీ లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గ్యాబ్రియేల్ ఇండియా (Gabriel India) పై మోతీలాల్ ఓస్వాల్ సానుకూల రేటింగ్ ఇచ్చింది. మరో 30% లాభాల అంచనాతో రూ. 1266 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు, ఆర్థిక బలం మరియు భవిష్యత్తు వృద్ధి అంచనాలను ఇక్కడ చూడండి.
ఆర్‌బీఐ సరికొత్త డాలర్-రూపాయి స్వాప్ ఫెసిలిటీ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ పరుగులు పెడుతోంది. SBI, ICICI, IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లలో భారీ లాభాలు రావడానికి గల అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.