తెలంగాణలో వలసల రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకూ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటాపోటీ రాజకీయం నడుస్తోందని అంతా భావించారు. అయితే ఆ రెండు పార్టీలనూ మించి కాంగ్రెస్ లోకి వలసలు పోటెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకూ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలే కాదు పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ జోరు కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.
అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో అంటే ఆగస్టులో మరో సారి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ కుమారుడు అయిన కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ లో రాహుల్ పర్యటన విజయవంతమైన సంగతి తెలిసిందే. వరంగల్ రైతు డిక్లరేషన్ కు భారీ స్పందన రావడంతో ఈ సారి సిరిసిల్ల సభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రవేశపెట్టాలన్ని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. సిరిసిల్ల బహిరంగ సభ పై ఏఐసీసీ పెద్దలతో పీసీసీ చీఫ్ రేవంత్ చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
సిరిసిల్ల సభను బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభను మించి విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఇలా ఉండగా నేడో రేపో తెరాస సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
అలాగే బీజేపీ వరంగల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొడేటి శ్రీధర్ కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. వీరిరువురూ కాంగ్రెస్ కీలక నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి, పాలమూరు మాజీ ఎమ్మెల్యే ఏర్రశేఖర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు కూడా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/joinings-in-congress-rahul-to-tour-telangana-next-month-39-139141.html
Publish Date:Oct 11, 2026
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
Publish Date:Oct 11, 2026
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ