వలసలు జనసేనకు బలమా? బరువా?

Publish Date:Sep 25, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రణాళికా బద్ధంగా వైసీపీ ప్రయత్నం చేస్తోందా? అన్న ప్రశ్నకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అనాల్సి వస్తోంది. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. వారంతా తిన్నగా జనసేన గూటికి చేరుతున్నారు. జనసేనాని వారి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, సామినేని ఉదయభానులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వీరు ముగ్గురూ కూడా గురువారం (సెప్టెంబర్ 26) పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరి ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. వీరు ముగ్గురే కాదు.. వీరితో పాటు వీరి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన పంచన చేరే నేతల సంఖ్య ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉంది.

కనీసం మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసి జనసేన పంచన చేరనున్నారు. వీటన్నిటికీ జనసేనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యం అని పవన్ కల్యాణ్ గతంల పలుమార్లు ప్రకటించారు. రాజకీయాలలో కొనసాగే అర్హత ఆ పార్టీకి లేదనీ దుమ్మెత్తి పోశారు. అయితే రాజకీయంగా వైసీపీని మళ్లీ పుంజుకోకుండా చేయాలంటే.. ఆ పార్టీ నుంచి వచ్చే వాళ్లందరికీ తమ పార్టీ తలుపులు బార్లా తెరిచేసి జనసేన తిర్థం పుచ్చుకునేలా చేయడమే మార్గమా? అంటే పరిశీలకులు మాత్రం కాదనే అంటున్నారు. 

ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన జగన్ అండ చూసుకుని ఆ పార్టీ నేతలు ఇష్టారీతిగా చెలరేగిపోయారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి దూకేస్తున్న వారిలో ఎక్కువ మంది జగన్ అధికారంలో ఉండగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలను వేరే లెవల్ కు తీసుకువెళ్లిన వారే. ఇప్పుడు జగన్ అధికారం కోల్పోయిన తరువాత.. వారంతా కేసుల భయంతో వణికి పోతున్నారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం కూటమి పార్టీలలో ఏదో ఓ పార్టీ పంచన చేరితే చాలని భావిస్తున్నారు. అటువంటి వారికి జనసేనాని జనసేన తలుపులను బార్లా తెరుస్తున్నారు. ఇది కూటమి పార్టీల శ్రేణులు, నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది. ముఖ్యంగా గత ఐదేళ్ల పాటు జగన్ హయాంలో తీవ్రమైన వేధింపులు, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొన్న పార్టీ నేతలు, శ్రేణులు ఇలా వైసీపీ నుంచి వస్తున్న వారికి పార్టీ తలుపులు బార్లా తెరవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

సాధారణంగా చంద్రబాబు నేతల తప్పులను క్షమించేసే తత్వం చాలా ఎక్కువ ఉందని తెలుగుదేశం శ్రేణులు భావిస్తుంటాయి. అటువంటి చంద్రబాబే వైసీపీ నుంచి చేరికల విషయంలో  చాలా కఠినంగా ఉంటున్నారు. బాలినేని వంటి వారు తెలుగుదేశం తలుపు తట్టినా తెరవలేదు. అయితే జనసేనాని మాత్రం వచ్చిన వారిని వచ్చినట్లుగా అనుమతించడం పట్ల తెలుగుదేశంలోనే కాదు, జనసేనలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఒంగోలులో అయితే ఈ అసంతృప్తి నిరసన ప్రదర్శనలు, ఫ్లెక్సీల చించివేత వరకూ వెళ్లింది. బాలినేని జనసేన గూటికి ఇంకా పూర్తిగా చేరకుండానే ఒంగోలులో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు తలెత్తాయి. విమర్శలు, ప్రతివిమర్శల వరకూ పరిస్థితి వెళ్లింది. ఇది మొత్తంగా కూటమి ఐక్యతను దెబ్బతీయకుండా జనసేనాని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.   వైసీపీ నుంచి వలసలు జనసేనకు బలం కాదనీ బరువేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.