అయ్యా కొడుకులకి అండర్‌స్టాండింగ్ లేనట్టుంది!
Publish Date:Aug 13, 2024
Advertisement
ఆత్రంగా అవినీతి చేయడం తప్ప అయ్యా కొడుకులు జోగి రమేష్, జోగి రాజీవ్ మధ్య సరైన అండర్‌స్టాండింగ్ లేనట్టుంది. పాపాలు పండి దొరికిపోయినప్పుడు తోడుదొంగలు ఇద్దరూ ఒకేమాట చెప్పాలన్న కనీస పరిజ్ఞానం వీళ్ళకి లేనట్టుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో జోగి రమేష్ పుత్రరత్నం జోగి రాజీవ్‌ని పోలీసులు అరెస్టు చేసినప్పడు జోగి రమేష్ ఆవేశంగా రోడ్డు మీదకి వచ్చి ‘‘అటాచ్‌మెంట్‌లో వున్న భూములని ఎవరైనా కొంటారా?’’ అని ఆవేశంగా ప్రశ్నించారు. ఈ వైసీపీ వాళ్ళ బుద్ధులు తెలియనివాళ్ళు ఎవరైనా జోగి రమేష్ ఆవేశం చూశారంటే, తండ్రికొడుకులిద్దరూ అమాయక చక్రవర్తులు అని పొరపడే అవకాశం వుంటుంది. కానీ, వీళ్ళ జాతకం అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ అలా అపోహ పడే అవకాశం లేదులెండి. రోడ్డు మీద తండ్రి ఇలా ఆవేశంగా ప్రశ్నించాడా? పోలీసుల కస్టడీలో వున్న జోగి రాజీవ్ తన దగ్గరకి వచ్చిన మీడియా ప్రతినిధులతో ‘‘అందరూ కొన్నట్టే మేమూ కొన్నాం... ఇందుతో తప్పేంటి’’ అని అమాయకంగా ప్రశ్నించాడు. జోగి రమేష్ తన కొడుక్కి అవినీతి ఎలా చేయాలో నేర్పించాడుగానీ, దొరికిపోయినప్పుడు ఎలా మాట్లాడాలో చిలక పలుకుల్లాగా నేర్పించినట్టు లేడు. అసలింతకీ ఏంటీ అగ్రిగోల్డ్ భూ కబ్జా భాగోతం? సింపుల్‌గా చెప్పాలంటే, అగ్రిగోల్డ్ స్కామ్‌కి సంబంధించిన భూమి సర్వే నంబర్ 87. ఈ సర్వే నంబర్లో భూమి అటాచ్‌మెంట్‌లో వుంది కాబట్టి దీనిని ఎవరూ కొనడానికి వీల్లేదు. మన జోగి రమేష్ ఏం చేశాడంటే, 87 సర్వే నంబర్ పక్కనే వున్న, ఎలాంటి వివాదాలు లేని 88 సర్వే నంబర్లో భూమిని కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సర్వే నంబర్ తప్పు పడిందంటూ 88వ నంబర్ని 87వ నంబర్‌గా మార్చుకున్నాడు. ఈ రకంగా అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారు. కొన్ని నెలల తర్వాత అదే స్థలాన్ని జోగి రమేష్ బినామీ అయిన వైసీపీ కార్పొరేటర్‌కి అమ్మేశారు. ఇంత జరిగింది!
http://www.teluguone.com/news/content/jogi-ramesh-son-arrested-25-182879.html





