కొడాలి ప్లేస్‌లో జోగి!.. జగన్-జోగి రాసుకుంటే..?
Publish Date:Apr 11, 2022
Advertisement
పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు మంత్రి పదవి వరించింది. ఏరికోరి మరీ జోగిని తీసుకొచ్చి కేబినెట్‌లో కూర్చోబెట్టుకున్నారు జగన్‌రెడ్డి. జస్ట్.. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన జోగికి.. ఎందుకంత ప్రాధాన్యమో ఇట్టే చెప్పేయొచ్చు. ఇంకెందుకు, ఇటీవల చంద్రబాబు ఇంటి మీదకు దండయాత్రకు వెళ్లినందుకే..అంటున్నారు. వందలాది వాహనాల్లో.. వేలాది మంది అనుచరులను వెంటేసుకొని.. కార్లలో కర్రలు, రాడ్లు పెట్టుకొని.. కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటి మీదకు దాడికి తెగించారు జోగి రమేశ్. టీడీపీ శ్రేణులు రక్షణ గోడగా నిలబడి.. జోగి యాగిని అడ్డుకున్నారు కానీ... లేదంటే, దారుణమే జరిగిపోయేది. మీడియా సాక్షిగా అంత పెద్ద ఎత్తున దాడికి వచ్చినా.. ఆయనపై గట్టి కేసు నమోదు కాకపోవడం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు ఇంటి మీదకు దాడికి తెగించిన జోగి రమేశ్‌కు.. ఇప్పుడు మంత్రి పదవితో అందలం ఎక్కించారు జగన్‌రెడ్డి. తనకు కావలసింది ఇలాంటి వాళ్లే అనే మెసేజ్ ఇచ్చేశారు. కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని మంత్రి పదవి పీకేసి.. ఆయన ప్లేస్‌లో జోగి రమేశ్‌కు ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. అంటే? ఇకపై నాని లేని లోటును జోగి ఫిల్ చేస్తారని అంటున్నారు. బూతుల మంత్రిగా మూడేళ్లుగా ఫుల్‌గా రెచ్చిపోయిన కొడాలిని.. కొత్తగా వచ్చిన జోగి రమేశ్ భర్తీ చేస్తారో.. అంతకుమించి అన్నట్టు బూతులకు యాక్షన్ కూడా జత చేస్తారో ఏమో.. అంటున్నారు. వైఎస్సార్ హయాం నుంచి ఆ ఫ్యామిలీకి జోగి రమేశ్‌కి క్లోజ్‌గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అంటారు. మందిమార్బలాన్ని పోగేయడంలో ఆయన ఎక్స్‌పర్ట్. జగన్ మీటింగులకు మనుషులను తరలించేది ఈయనే. ఫ్లెక్సీల రాజకీయంలో ముందుంటారు. అలా అలా.. తనకు తాను ఫుల్‌గా ప్రమోషన్ చేసుకొని.. చంద్రబాబు ఇంటిపై అటాక్‌కు వెళ్లి.. జగనన్న దృష్టిలో పడి.. ఇప్పుడిలా జోగి రమేశ్ అనే నేను.. అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
http://www.teluguone.com/news/content/jogi-ramesh-as-minister-39-134200.html





