Publish Date:Oct 24, 2024
కాంగ్రెస్ ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన ముఖ్య అనుచరుడు గంగారెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడు హత్య చేయడం పట్ల తీవ్ర కలత చెందినట్లు కనిపిస్తుంది. గంగారెడ్డి ని హత్య చేసిన సంతోష్ గత ఎన్నికల్లో బిఆర్ ఎస్ తరపున పని చేసినట్లు జీవన్ రెడ్డి ఏఐసిసి చీఫ్ ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారన్నారు . కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చనువుతో తన అనుచరుడైన గంగారెడ్డి హత్యకు గురయ్యాడని జీవన్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గేట్లు తెరవడంతో అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దూరమవుతున్నారని లేదా హత్యలకు గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన రాజీవ్ గాంధీ ఆశయాలకు తిలోదకాలిచ్చే విధంగా రేవంత్ సర్కారు చర్యలుంటున్నాయని ఆయన ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు ఉన్నప్పటికీ పక్క పార్టీల ప్రజా ప్రతినిధులను చేర్చుకోవడం తప్పుడు సంకేతాలు తీసుకెళుతుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.పదేళ్లుగా బిఆర్ ఎస్ ఏఏ పనులు చేసిందో అవే పనులు రేవంత్ సర్కార్ చేస్తుందన్నారు . అప్పట్లో కెసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రేవంత్ సర్కార్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో జీవన్ రెడ్డి మీకో దండం మీ పార్టీకో దండం అంటూ హాట్ టాపిక్ గా మారారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jeevan-reddy-scathing-letter-to-aicc-chief-25-187344.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు