బీఆర్ఎస్ కు కుమార స్వామి దూరం ఎందుకంటే.. ?

Publish Date:Jan 18, 2023

Advertisement

ఖమ్మం బీఆర్ఎస్ సభకు జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దూరంగా ఉన్నారు. ఆయనే కాదు.. జీడీఎస్ పార్టీ ప్రతినిధులెవరూ కూడా హాజరు కాలేదు.  దీంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ పయనం ప్రారంభించనప్పటి నుంచీ ఆయనతో అడుగులు వేయడానికి ఉత్సాహం చూపిన జేడీఎస్, కుమారస్వామి.. బీఆర్ఎస్ కు దూరం జరిగారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ తన జాతీయ ఆకాంక్షను బయటపెట్టిన క్షణం నుంచీ..   కుమారస్వామి ఆయనకు మద్దతు పలికారు.  పార్టీ ప్రకటన సందర్భంలోనూ,  ఢిల్లీ లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ కుమార స్వామి కేసీఆర్ వెంట నిలిచారు. కానీ   ఆవిర్భావ సభకు మాత్రం దూరం జరిగారు. బీఆర్ఎస్ వర్గాలు ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని చెబుతున్నా.. జేడీఎస్ కు సంబంధించి ఎవరూ ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభకు హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఏదో చెడిందన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.  అలాగే.. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఖమ్మం ఆవిర్భావ సభలో ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ కర్నాటక బాధ్యతలు ప్రకాశ్ రాజ్ చేపడతారన్నంతగా ప్రచారం జరిగినా.. అత్యంత కీలకమైన ఆవిర్భావ సభకు ఆయన గైర్హాజర్ కావడంతో ఏదో జరిగింది, బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ దూరం జరిగారా, లేక కేసీఆరే పక్కన పెట్టారా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కుమారస్వామి బీఆర్ఎస్ తో ఎడం పాటించడంతో..   జేడీఎస్ బీఆర్ఎస్ మిత్రపక్షంగా ముందుకు సాగడానికి సుముఖంగా లేదన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తుండటం జేడీఎస్ నేత కుమారస్వామికి నచ్చలేదనీ, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి జేడీఎస్ అభ్యర్థుల కోసం ప్రచారానికే పరిమితమవ్వాలన్న ఆయన కండీషన్ ను కేసీఆర్ అంగీకరించలేదనీ ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే బీఆర్ఎస్ తో పొత్తుకు ముందే కుమారస్వామి తెగతెంపులు చేసుకున్నారని అంటున్నారు.  

అసలింతకీ ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభతో కేసీఆర్ భారాస పార్టీ జాతీయ పార్టీగా అన్ని వర్గాల గుర్పింపు పొందేసినట్లేనా? అంటే ఔనన్న సమాధానం వస్తుందా, వచ్చిందా? అని స్పష్టంగా చెప్పలేము. కత్తీ పోయి డాలు వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లుగా ఆవిర్బవం నుంచీ తొడుగా ఉన్న మిత్రుడు దూరమై కొత్త మిత్రులు వచ్చారు అని మాత్రమే చెప్పగలం.  జేడీఎస్ దూరమై ఆప్ దగ్గరైంది. వామపక్షాలు వచ్చి చేతులు కలిపినా.. ఆ పార్టీలకు కేసీఆర్ బలం కావాలే తప్ప కేసీఆర్ కు అవి బలంగా ఉండే అవకాశం లేదు. మరి ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సాధించిందేమిటయ్యా అంటే జేడీఎస్ ను దూరం చేసుకుని ఆప్ కు దగ్గరవ్వడం. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో.. ఆప్ అధినేత కేజ్రీవాల్ కు కూడా అంతే బలీయంగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో పాగా కోసం ఆప్ గతంలో కొంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో ఆయన వ్యూహం మార్చి తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి ఆప్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం హస్తినలో ఆందోళనలకు దిగినప్పుడు కూడా స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారాస విషయంలో మాత్రం ఆయన ఖమ్మం సభకు రావడానికి ముందు వరకూ ఎటువంటి సానుకూలతా ప్రదర్శించలేదు. హిమాచల్, గుజరాత్ ఎన్నికలలో ఆప్ పరాభవం తరువాత వ్యూహం మార్చుకుని భారాస ఆవిర్భావ సభకు హాజరయ్యారు. భారాస అండతో తెలంగాణలో  బలోపేతం అన్న వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ పార్టీ పూర్తిగా విస్తరించకముందే.. కొందరు మిత్రులను దూరం చేసుకుని కొత్త మిత్రులకు దగ్గరయ్యారు అని మాత్రమే భారాస ఆవిర్భావ సభ ద్వారా వెల్లడైంది. అయినా తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు మద్దతు పలికితే బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా?  అంటే కాదనే రాజకీయ వర్గాలు అంటున్నాయి.

గత మూడు నాలుగేళ్లుగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన కేసీఆర్ సొంతంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసేసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేస్తానంటున్నారు.  కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్  వంటి వారు జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత విషయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వారు ముగ్గురూ కూడా ఆది నుంచీ కేసీఆర్ తో అడుగులు వేయడానికి సుముఖంగా లేరు. స్టాలిన్ అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర శక్తుల ఐక్యత వీలుకాదని ఇప్పటికే కుండ బద్దలు కొట్టేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ది కూడా దాదాపు అదే బాణి, అదే బాట. ఆయన సొంత రాష్ట్రం బీహార్ లో జేడీఎస్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో పొత్తులో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆవిర్బావ సభతో కేసీఆర్ సాధించిందేమిటన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.  

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.